తెలుగు ఇండస్ట్రీ 69 సంవత్సరాల కల సాకారం అయ్యి, మొదటిసారి నేషనల్ అవార్డ్‌ తెలుగు నటుడికి సొంతం అయ్యింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని వరించింది. ఈ వార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు సంతోషంతో అల్లు అర్జున్ కి విషెస్ తెలుపుతున్నారు.

Video Advertisement

అయితే మరోవైపు అల్లు అర్జున్ పై నెగెటివిటీ, ట్రోలింగ్ జరుగుతోంది. బన్నీకి నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భంగా సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా బన్నీని విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. దానికి బన్నీ ఇచ్చిన రిప్లైను చూసిన నెటిజెన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. పుష్ప రాజ్ పాత్ర‌కి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు రావ‌డంతో తెలుగు ఇండస్ట్రీలో ఆనందం వెల్లివిరిసింది. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే మారుమ్రోగుతుంది. నేషనల్ అవార్డ్ తో పాన్ ఇండియాలో అల్లు అర్జున్ రేంజ్ రెట్టింపు అవుతుందని టాక్.

జాతీయ ఉత్త‌మ న‌టుడు అవార్డు వచ్చిన సందర్భంలో సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను సోషల్లో మీడియాలో విష్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ మహేష్ బాబుకు రిప్లై ఇస్తూ, థ్యాంక్యూ అంటూ నలుపురంగులో ఉన్న హార్ట్ సింబల్ షేర్ చేశాడు.
బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ షేర్ చేయడంతో నెటిజెన్లు అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబుకు మాత్రమేకాకుండా మరికొందరికి కూడా బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ తో థాంక్యూ చెప్పారు. అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తుండడంతో ‘మిలాగ్రోమూవీస్’ అనే ట్విట్టర్ యూజర్ బ్లాక్ హార్ట్ సింబల్ అంటే ప్రేమ మరియు ఆప్యాయతను సూచిస్తుందని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read: “జై భీమ్” లాయర్ చంద్రు రియల్ లైఫ్ గురించి తెలుసా..? ఆయన సాల్వ్ చేసిన కేసులు ఎన్నో తెలిస్తే మైండ్ బ్లాక్..!