పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండా చిహ్నం అర్థం ఏంటో తెలుసా..? ఎరుపు రంగుని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు అంటే..?

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండా చిహ్నం అర్థం ఏంటో తెలుసా..? ఎరుపు రంగుని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు అంటే..?

by Harika

Ads

పవర్ స్టార్ గా ఎదిగి, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ నుండి ఎంతో మందికి సేవ చేశారు. పార్టీ గుర్తు కూడా కొత్తగా ఉంటుంది. ఎన్నికల్లో పార్టీకి గాజు గ్లాసు గుర్తుని ప్రకటించారు. అప్పటి నుండి గాజు గ్లాస్ చూసిన ప్రతిసారి జనసేన పార్టీ గుర్తొస్తుంది. అయితే జనసేన పార్టీ జెండా లో ఉండే చిహ్నానికి కూడా చాలా అర్థం ఉంది. ఒకసారి దీని అర్థం తెలుసుకుంటే, ఇంత ఆలోచించి ఒక పార్టీ జెండా చిహ్నం తయారు చేశారా అని అనిపిస్తుంది. దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

meaning behind janasena party emblem

# బ్యాక్ గ్రౌండ్ లో తెలుపు రంగు ఉంటుంది. ఇది శాంతిని, ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న భారతీయ నాగరికతను, సంప్రదాయాన్ని సూచిస్తుంది.

# చిహ్నం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది విప్లవానికి గుర్తు. మన పురాతన జాతీయ ధర్మాలని, ఇప్పటి మార్పులతో, వాటిని ఇంకా అభివృద్ధి చేసి చెప్పాలి అనే ఉద్దేశంతోనే తెలుపు మీద ఎరుపు రంగు వచ్చేలాగా డిజైన్ చేశారు.

# చిహ్నంలో నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రానికి ఆరు దిక్కులు ఉంటాయి. ఈ ఆరు దిక్కులు పార్టీ పాటించే ఆరు సూత్రాలని తెలియజేస్తాయి. ఈ సూత్రాలు, విలువలు మనకి మన తరతరాల నుండి వస్తున్నాయి అని దీని అర్థం. నక్షత్రం మధ్యలో ఉండే తెలుపు రంగు స్వయం ప్రకాశాన్ని తెలియజేస్తుంది. మన విలువల వల్ల మన దారిలో మనం సొంతంగా వెలుగుతాం అని దీని అర్థం వచ్చేలాగా డిజైన్ చేశారు.

# నక్షత్రం మధ్యలో ఉండే చుక్క ఆత్మని తెలియజేస్తుంది. మన ఆత్మ మన నిజం. ఈ చుక్కని మధ్యలో పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది మన దేశానికి మనం నిజంగా ఏం చేస్తున్నాం అనేది తెలియజేస్తుంది. ఇదే గుండె అంత ముఖ్యమైనది. అందుకే ఈ చుక్క ని మధ్యలో పెట్టారు.

# ఎంబ్లెమ్ చుట్టూ బ్లాక్ లైనింగ్ ఉంటుంది. ఇది విప్లవానికి, అందుకు వచ్చే వ్యతిరేకతని బ్యాలెన్స్ చేసి, సామరస్యంగా ఉంచడానికి సూచిస్తుంది.

# ఈ పార్టీ ఎంబ్లెమ్ అనేది మన దేశం యొక్క జీవితాన్ని, అందుకోసం పోరాటం చేసిన వారి పోరాటాన్ని సూచిస్తుంది.

ఒక్క చిహ్నంలో ఇంత భావం ఉండేలాగా పార్టీ జెండా రూపొందించారు.


End of Article

You may also like