“జనని” సాంగ్ లో ఈ చరణాలకు అర్ధం తెలుసా..? తెలిస్తే కీరవాణిని మెచ్చుకోకుండా ఉండలేరు..!

“జనని” సాంగ్ లో ఈ చరణాలకు అర్ధం తెలుసా..? తెలిస్తే కీరవాణిని మెచ్చుకోకుండా ఉండలేరు..!

by Anudeep

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

Video Advertisement

ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. కొద్ది సేపటి క్రితమే ఆర్ ఆర్ ఆర్ నుంచి జనని సాంగ్ విడుదల అయ్యింది.

janani 1

అయితే.. ఈ పాట విడుదల అవ్వడం ఆలస్యం అన్నట్లు సోషల్ మీడియాలో సందడి మొదలైంది. అయితే.. ఈ పాట చాలా ఎమోషనల్ గా సాగుతుంది. అందరి హృదయాలను తాకుతోంది. అయితే ఈ పాటకి అర్ధం మాత్రం చాలా మందికి తెలియదు. ఈ పాటలో ఉన్న లిరిక్స్ అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

janani 2

“జననీ… ప్రియ భారత జననీ
జనని…”

భారత మాతను “జనని” అని సంబోధిస్తూ .. ఈ పాట ప్రారంభం అవుతుంది.

janani 3

“నీ పాద ధూళి తిలకంతో హాలం ప్రకాశమవని..”

ఈ లైన్ వచ్చేటప్పుడు సీత పాత్ర పోషించిన అలియా నేలపైన మట్టి తీసుకుని.. రామ్ చరణ్ నుదిటిన తిలకంలా దిద్దుతుంది. హాలం అంటే నాగలి.. నాగలితో భూమిని దున్నడం ద్వారా ఎలా ప్రకాశవంతమైన పంటను పండించగలుగుతామో.. అలాగే.. ఆ తల్లి పాదధూళి (మట్టి) తాకడం ద్వారా మన స్వతంత్ర పోరాటంలో కూడా విజయం ప్రకాశవంతమై కనిపిస్తుందని అర్ధం.

“నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని”

నిష్కళంక అంటే.. ఎటువంటి కళంకాలు (మచ్చలు) లేనిది అని అర్ధం. అటువంటి భరతమాత చరిత్ర ప్రతిరోజు నా సుప్రభాతమవ్వాలని కోరుకుంటున్నారు.

 

janani 4

“జనని…
ఆ నీలి నీలి గగనం
శత విస్పులింగమయమై”

ఇక్కడ గగనం అంటే ఆకాశం.. శత అంటే వంద.. విస్పులింగం అంటే మండే అగ్నికణాలు అని అర్ధం. ఈ లైన్ లో ఏమి చెపుతున్నారంటే.. నీలి రంగులో ఉన్న ఆకాశం వంద అగ్నికణాల మయంగా మారిపోయింది అని చెప్తున్నారు. వీడియోలో ఈ లైన్ వస్తున్నపుడు.. నీలి నీలి గగనం అని వచ్చినపుడు ఎన్టీఆర్ ను చూపిస్తారు. శత విస్పులింగమయమై అని వచ్చినపుడు రామ్ చరణ్ ని చూపిస్తారు. “ఆర్ ఆర్ ఆర్” నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఎన్టీఆర్ ని చూపించినప్పుడు నీలి రంగు (సముద్రం లేదా ఆకాశం), రామ్ చరణ్ ని చూపించినప్పుడు నిప్పు రంగుని (అగ్ని) చూపిస్తూ వచ్చారు.. ఈ పాటలో కూడా అదే అర్ధం వచ్చేలా వారిని చూపించారు. నిజం గా జీనియస్ కదా.

janani 5

“ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ ఘర్జనములై
హా నిశ్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవనీ..
జననీ..”

ఆ హవన గంగ ధ్వనులే అంటే.. జలపాతాల నుంచి వచ్చే శబ్దం అని అర్ధం వస్తుంది. అంటే.. స్వతంత్ర పోరాటంలో సమర యోధుల కన్నీళ్ల జలపాతాల నుంచి వచ్చే శబ్దాలు అని పాటకు అన్వయించారు. “హరినాశ” అంటే విధ్వంసం అని అర్ధం. అంటే వారి కన్నీటి జలపాతాల నుంచి వచ్చే శబ్దాలే శత్రువుల విధ్వంసానికి ఘర్జనలయ్యాయని అర్ధం. “నిశ్వనాలు ” అంటే శబ్దం అని అర్ధం. “హా నిశ్వనాలు నా సేద తీర్చు నీ లాలి జోలలవనీ” అంటే.. ఆ శబ్దాలే నా సేద తీర్చే లాలిపాటలు అవుతున్నాయని అర్ధం. పాట చిన్నదే అయినా.. ఎంత అర్ధవంతంగా మలిచారో కదా..


End of Article

You may also like