ఈ స్మోకింగ్ యాడ్ లో చిన్న పాప ఇప్పుడెలా ఉందొ తెలుసా? హీరోయిన్ లా ఉంది చూడండి..!

ఈ స్మోకింగ్ యాడ్ లో చిన్న పాప ఇప్పుడెలా ఉందొ తెలుసా? హీరోయిన్ లా ఉంది చూడండి..!

by Anudeep

Ads

మనం ఏదైనా సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్ళమంటే చాలు మనకి ముందుగా కనిపించేది యాంటీ స్మోకింగ్ యాడ్. పొగాకు ఆరోగ్యానికి హానికరం, కాబట్టి వాటి వాడకం తగ్గిస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సంతోషం గా ఉంటారు అని అర్ధం వచ్చేలా ఈ యాడ్ ను రూపొందించారు.

Video Advertisement

ఈ యాడ్ స్టార్ట్ అవగానే, ఓ వ్యక్తి తన కూతురు తో కలిసి కూర్చుంటాడు. సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆ వెనకాలే అతని భార్య కూడా ఎదో పని చేస్తూ ఉంటుంది. ఆమె విచారం గా ఉంటుంది.

simran 1

యాడ్ అయిపోగానే చివరిలో.. ఆమె కూతురు తో కలిసి నవ్వుతు కనిపిస్తుంది. తన భర్త సిగరెట్ తాగుతున్నాడని ఆమె మొదట బాధపడుతుంది. ఆ తరువాత అతను సిగరెట్ మానేయడం తో.. ఆమె ఎంతో సంతోషిస్తుంది. సిగరెట్ తాగే వ్యక్తి ఆరోగ్యం మాత్రమే కాదు.. అతని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. సిగరెట్ మానేయడం వలన మీరు మాత్రమే కాదు.. మీ కుటుంబం కూడా బాగుంటుంది అంటూ ఈ యాడ్ తో మెసేజ్ ఇస్తారు.

simran 2

ఈ యాడ్ లో చిన్నపాపగా నటించిన అమ్మాయి గుర్తుందా. ఆమె ఇప్పుడు హీరోయిన్ లా ఉంది. ఫ్యాషనిస్ట్ గా ఎదిగింది. తండ్రి ఎదురుగా సిగరెట్ తాగుతుంటే నిస్సహాయంగా చూస్తూ, ఆ తర్వాత విసిరేస్తే కౌగిలించుకునే ఆ చిన్నారి అమాయకమైన ముఖం ప్రతి సినీ ప్రేక్షకుడి మదిలో గుర్తుండిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు యూత్ ఫ్యాషనిస్ట్ గా మారింది. ఆమె పేరు సిమ్రాన్ పటేకర్. ప్రస్తుతం ఆమె వయసు 17 సంవత్సరాలు. ఆమె 2008లో ఏడేళ్ల వయసులో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన యాడ్‌లో నటించింది. 45 సెకన్ల నిడివి గల ఈ యాడ్ దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.

 


End of Article

You may also like