మెగా ఫ్యామిలీ కోడలు మరియు అపోలో హాస్పిటల్స్  చైర్మన్ మనవరాలు అయిన ‘ఉపాసన’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె రామ్‌చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో ఫౌండేషన్ కి వైస్‌ చైర్‌ పర్సన్‌గా, తనదైన శైలిలో సేవ చేస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. ఉపాసన తాజాగా 2022-23 ‘మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆఫ్ ఆసియా’ లిస్ట్ లో స్థానం పొందారు.

Video Advertisement

ఇటీవల రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా ఘనంగా  సంబరాలు జరుపుకున్న మెగా కుటుంబానికి మరో ఘనత రావడం మెగా ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా సంతోషంలో అభినందనలు తెలుపుతున్నారు. ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఉపాసనకు అభినందనలు చెప్తున్నారు.
ఉపాసన అందించిన సేవలకు ఈ ఘనత లభించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. ఇందుకు గాను ఉపాసన కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేసింది. పర్సనల్ జీవితాన్ని మరియు ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా నిర్వహిస్తున్న వారిలో ఉపాసన ఒకరని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉపాసన తల్లి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. వీటన్నిటితో మెగా కుటుంబంలో సంతోషాలు నిండాయని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఉపాసన తరచుగా సామజిక కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కూడా చేస్తోంది. ఆమె ఇప్పుడు అపోలో ఛారిటీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తోంది. అంతే కాకుండా ఎడిటర్‌గా ‘బి పాజిటివ్’ హెల్త్ మ్యాగజైన్‌కు వ్యవహరిస్తున్నారు. ఆమె  చిన్నతనం నుండే బిజినెస్ మెలకువలను నేర్చుకుంటున్నారు. ఆమె ‘యు ఎక్స్చేంజ్’ సంస్థ స్థాపించి, పాత స్కూల్ బుక్స్ ను సేకరించి, వాటిని పేదవారి పిల్లలకు అందచేసేవారు. అలాగే మురికివాడల్లో అనారోగ్యంతో ఉన్న పిల్లలకు తమ అపోలో హెల్త్ సిటీలో ఉచితంగా చికిత్స చేయించేవారు.
Also Read: అరుణాచలం మూవీలో రజినీకాంత్ బామ్మాగా నటించిన ఈ నటి బ్యాగ్రౌండ్ గురించి తెలుసా?