Ads
దర్శకధీరుడు రాజమౌళి తీసిన చిత్రం బాహుబలి… దీంతో ప్రాంతీయ చిత్రాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. అయితే పక్క భాషలో క్రేజ్ ఉన్న హీరోతో సినిమా తీస్తే అది బ్లాక్ బస్టర్ అయిపోద్ది అని దర్శకులు భావించడం .. అలాగే పక్క రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకులతో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ కొట్టేయొచ్చు అని హీరోలు అనుకోవడం ఎప్పటినుంచో జరుగుతుంది.
Video Advertisement
అయితే గత కొంత కాలంగా మన తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఏమాత్రం కలిసి రావడం లేదు. కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన టాలీవుడ్ హీరోలకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురవుతోంది. ఈ లిస్టులో మహేష్ బాబు ‘స్పైడర్’, విజయ్ దేవరకొండ ‘నోటా’, అలాగే రామ్ పోతినేని ‘ది వారియర్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలను తమిళ దర్శకులే తెరకెక్కించారు. ఇప్పుడు ఈ లిస్టులో నాగ చైతన్య ‘కస్టడీ’ కూడా చేరింది.
దీంతో టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేస్తే ఫ్లాపే అన్న సెంటిమెండ్ బలపడింది. ఈ నేపథ్యం లో మెగా ఫాన్స్ కి కొత్త భయం పట్టుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ల్ రాజు నిర్మాణంలో హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
ఇప్పుడు ఈ మూవీ విషయంలో ఎక్కడ కోలీవుడ్ డైరెక్టర్ల బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో అని మెగా అభిమానులు వర్రీ అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే తమిళ దర్శకులతో వర్క్ చేసేందుకు టాలీవుడ్ హీరోలు భయపడతారు అనడంలో సందేహం లేదు. అలాగే మరోవైపు ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్ కూడా ఈ మూవీ పైనే ఆధార పడి ఉంది.
ఈ మధ్య కాలంలో దిల్ రాజుకు అటు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా భారీ షాకులు తగిలాయి. దిల్ రాజుకు గత నెల రోజుల్లో ఏకంగా 35 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయని సమాచారం. శాకుంతలం, కస్టడీ సినిమాల ఫలితాలు దిల్ రాజుకు భారీ షాకిచ్చాయి. గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధిస్తే దిల్ రాజుకు ఈ నష్టాలు అన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇక భారీ అంచనాలున్న చరణ్ శంకర్ కాంబో మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యమవుతోంది.
End of Article