మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక.. మెగాస్టార్ లూసిఫెర్ రీమేక్ పాత్రలో బిజీ కాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసారు. అయితే.. టైటిల్ ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ సినిమాలో ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ నటించిన స్టీఫెన్ పాత్రను మెగాస్టార్ నటించనున్నారు.

lucifer

ఈ సినిమాకు టైటిల్ గా “గాడ్ ఫాదర్” ను అనుకుంటున్నారట. ఈ టైటిల్ ను చిరంజీవి కూడా ఇష్టపడ్డారని తెలుస్తోంది. తొందరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. మాతృక కథను మాత్రం తీసుకుని.. చిరుకు తగ్గట్లు ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ కు భిన్నం గా ఈ చిత్రం లో హీరోయిన్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది.