Ads
చాలా మంది బంగారాన్ని మాత్రమే కాదు డైమండ్స్ ని కూడా కొంటూ ఉంటారు నిమిషానికి మనం డైమండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనం నకిలీ డైమండ్స్ ని కూడా తెలియక కొనేయచ్చు.
Video Advertisement
అప్పుడు నష్టం వస్తుంది. అయితే మీరు కొనే డైమండ్ నిజమైనదా లేదా అది ఫేక్ డైమండ్ ఆ అనేది ఇలా సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
#1. డాట్ టెస్ట్:
ఈ టెస్ట్ ద్వారా డైమండ్ ని మనం టెస్ట్ చెయ్యచ్చు. దీని ద్వారా వజ్రం నిజమైనదో కాదు తెలుసుకోవచ్చు. డైమండ్ కింద నుండి ఒక చుక్క పెట్టండి సర్కులర్ రిఫ్లెక్షన్ వస్తే అది నకిలీది ఒకవేళ మీకు డాట్ కనపడలేదు అంటే అది నిజమైన డైమండ్.
#2. న్యూస్ పేపర్ తో టెస్ట్:
న్యూస్ పేపర్ టెస్ట్ చేసి కూడా తెలుసుకోవచ్చు న్యూస్ పేపర్ ని డైమండ్ దగ్గర పెట్టినప్పుడు అక్షరాలు స్పష్టంగా కనబడితే అది ఫేక్. అదే ఒకవేళ నిజమైనదైతే అన్ని వైపులా లైట్ వస్తుంటే అది నిజమైనది.
#3. యువీ లైట్ టెస్ట్:
లైట్ కింద డైమండ్ ని పెట్టండి నిజమైన డైమండ్ బ్లూ కలర్ లో మెరుస్తుంది. అలా రాలేదు అంటే అది కచ్చితంగా నకిలీది.
#4. వాటర్ టెస్ట్:
ఒక గ్లాస్ లో నీళ్లు పోసి అందులో డైమండ్ వేయండి. మునిగిపోతే అది రియల్ డైమండ్. లేదంటే అది నకిలీది.
#5. ఫాగ్ టెస్ట్:
మీ వేళ్ళ మధ్యలో డైమండ్ ని పెట్టి ఊదండి. నిజమైన డైమండ్ అయితే ఫాగ్ త్వరగా మాయం అవుతుంది. లేదంటే అది నకిలీది.
#6. వేడి చేయడం:
వేడి తగిలితే నిజమైన డైమండ్ ఏమీ అవ్వదు. కనుక డైమండ్ ని వేడి చేసి చూడండి దాంతో ఈజీగా తెలిసిపోతుంది. వజ్రం నిజమైనదా లేదా నకిలీదా అనేది.
End of Article