పొన్నియన్ సెల్వన్ 1 లో 7 మైనస్సులు ఇవేనా..?? మొదటిసారి చూసినప్పుడు అర్ధం చేసుకోడం కష్టమే.?

పొన్నియన్ సెల్వన్ 1 లో 7 మైనస్సులు ఇవేనా..?? మొదటిసారి చూసినప్పుడు అర్ధం చేసుకోడం కష్టమే.?

by Anudeep

Ads

బలమైన కథ, గ్రాండ్ విజువల్స్‌, భారీ హంగులతో సినిమాను రూపొందిస్తే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆదరిస్తారని ‘బాహుబలి’తో రుజువైంది. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ సక్సెస్ కావడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి తమ కలల ప్రాజెక్ట్‌లు తెరకెక్కించడానికి ధైర్యం వచ్చింది.

Video Advertisement

అలాంటి ఒక ధైర్యంతోనే దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవలను తెరకెక్కించాలని 4 దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించిన మణిరత్నం.. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

minus points in ponniyan selvan 1
తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో సెప్టెంబర్ 30ని ఈరోజు విడుదల చేశారు. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి భారీ తారాగణం నటించిన ఈ మూవీకి మొదటి షో నుండే మిశ్రమ స్పందన వచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి అనుకున్న స్పందన రాకపోవడానికి కారణాలేంటో చూద్దాం..

#1 మొదటి పార్ట్ లో కథ పరంగా చెప్పుకోడానికి బాగానే ఉంది కానీ.. తెరపై ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడు. సాంకేతికంగా చిత్రం అద్భుతంగా ఉంది.. కానీ దర్శకుడు కథనం పై కాస్త శ్రద్ధ పెడితే బావుండేది.

minus points in ponniyan selvan 1
#2 ఇలాంటి క్లిష్ట సబ్టెక్ట్‌ను తెరపై చక్కగా ఆవిష్కరించినా… అక్కడక్కడ ఎమోషన్స్ మిస్ అయిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలుగుతుంది. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ ఎమోషన్ సరిగ్గా ఎలివేట్ కాలేదు. కనెక్ట్ కాలేదు.

minus points in ponniyan selvan 1

#3 ఈ సినిమాను మొదటిసారి చూసినప్పుడు అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే, మణిరత్నం స్క్రీన్‌ప్లే కూడా స్మూత్‌గా లేదు. కాస్త గందరగోళంగానే ఉంది. మణిరత్నం శైలిలోనే నెరేషన్ కాస్త స్లోగా సాగింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలానే ఉన్నా మరీ అంతగా ఆకట్టుకోవు. డ్రామా చూస్తున్నట్టే ఉంటుంది.

minus points in ponniyan selvan 1
#4 చరిత్రని ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. మణిరత్నం తన స్క్రీన్ ప్లే తో ఆ విధంగా చెప్పలేకపోయాడు అన్నది వాస్తవం.

minus points in ponniyan selvan 1
#5 తెరపై ఎక్కువ పాత్రలు కనువిందు చేస్తాయి కానీ.. వాటికీ సరైన ఇంట్రడక్షన్ ఉండదు. దీంతో ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు.

minus points in ponniyan selvan 1
#6. సినిమాలో ప్రధాన పాత్ర పొన్నియన్ సెల్వన్ అయినా అతనిది గెస్ట్ రోల్ లానే ఉంటుంది. రెండో పార్ట్ లో అతడి పాత్రకు ప్రాధాన్యత పెరుగుతుందేమో చూడాలి. మొదటి పార్ట్ లో మాత్రం విక్రమ్, కార్తీ నే సినిమాను తమ భుజాలపై మోశారు.

minus points in ponniyan selvan 1
#7 చోళ రాజ్యానికి సంబధించిన చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ భారీ హిస్టారికల్ చిత్రంలో మోతాదుకు మించిన భారీ తనం ఉంది గానీ, ఆకట్టుకునే కంటెంటే మిస్ అయింది. మంచి నేపథ్యం, బలమైన పాత్రలను తీసుకున్నప్పటికీ.. టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని గందరగోళ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా దర్శకుడు మణిరత్నం మలచలేకపోయారు. దీనికి తోడు సినిమా స్లోగా సాగుతూ చాలా చోట్ల బోర్ కొడుతుంది.

minus points in ponniyan selvan 1

విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. సినిమాలో మణిరత్నం మార్క్ కనిపిస్తుంది కానీ మేజిక్ చేయలేకపోయారు. అంతే కాకుండా సినిమా ఎక్కువుగా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.


End of Article

You may also like