ప్రభాస్ అభిమానులకు దసరా పండగ ముందే వచ్చేసింది. ‘ఆది పురుష్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర దర్శకుడు ఓం రౌత్ శుక్రవారం ఉదయం రిలీజ్ చేశాడు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న ప్రభాస్.. ఆకాశానికి విల్లును ఎక్కు పెట్టిన పోస్ట్ అద్భుతంగా ఉంది.

Video Advertisement

పొడవాటి జుట్టు, భుజాలకు రుద్రాక్షలు ధరించిన ప్రభాస్ చాలా గంభీరంగా, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఓం రౌత్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫస్ట్ లుక్ క్షణాల్లో వైరల్ అయింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం టీజర్ ను ఆదివారం విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఓం రౌత్ తెలిపాడు. ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని సరయూ నది ఒడ్డున టీజర్ లాంచ్ చేస్తామని ప్రకటించాడు.

aadipurush first look review

సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని టి.సిరీస్ వారు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలై 2 ఏళ్ళు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభాస్ లుక్ కు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్..ఈ చిత్రానికి సంబంధించినంత వరకు ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా..అయితే ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ పోస్టర్ రిలీజ్ అయ్యింది. కానీ లుక్ పై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

aadipurush first look review
హిందీ, తెలుగు తో పాటు మొత్తం నాలుగు భాషల్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసారు. అయితే ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకునే విధంగా లేదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాముడికి మీసం ఉండదు కదా.. ఇప్పటివరకు మనం చూసిన పౌరాణిక చిత్రాల్లో కూడా రాముడికి మీసం లేదు. కానీ ఈ పోస్టర్ లో ప్రభాస్ కి మీసం ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది అని నెటిజన్లు అంటున్నారు. మరి అక్టోబర్ 2 న లాంచ్ చేసే టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.