“రాధే శ్యామ్” ట్రైలర్-2 లో ఈ విషయం గమనించారా..? అలాంటి పొరపాటు ఎలా చేసారు..?

“రాధే శ్యామ్” ట్రైలర్-2 లో ఈ విషయం గమనించారా..? అలాంటి పొరపాటు ఎలా చేసారు..?

by Mohana Priya

Ads

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Video Advertisement

రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.

mistake in radhe shyam release trailer

రాధే శ్యామ్ సినిమా రెండవ ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన ప్రభాస్, పూజా హెగ్డేతో పాటు ముఖ్య పాత్రలో నటించిన జగపతి బాబు, మరొక ముఖ్య పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్ మాత్రమే కాకుండా సహాయ పాత్రల్లో నటించిన ఇంకా కొంతమంది నటులు కూడా కనిపిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమాలో విక్రమాదిత్య అనే ఒక పామిస్ట్ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు.

mistake in radhe shyam release trailer

అయితే ఇదిలా ఉండగా రాధే శ్యామ్ సినిమా తెలుగు ట్రైలర్‌లో ఒక పొరపాటు జరిగింది. అదేంటి అంటే, తెలుగులో కృష్ణం రాజుగారు ఒక ముఖ్య పాత్ర పోషించారు. అదే పాత్రని తమిళంలో సత్యరాజ్ పోషించారు.అలా వెర్షన్‌కి తగ్గట్టు ఆ పాత్ర పోర్షన్స్ ని ఎడిట్ చేసారు. కానీ ఇవాళ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌లో మాత్రం స‌త్యరాజ్ ప్లేస్‌లో కృష్ణం రాజు గారిని ఎడిట్ చేయ‌లేదు. దాంతో ఇలాంటి చిన్న చిన్న విషయాలని కూడా కనిపెట్టిన నెటిజన్లు, “ఇవన్నీ చూసుకోవాలి కదా?” అని కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like