మాస్ మహారాజా రవితేజ, అందాల భామ శ్రీలీల కాంబినేషన్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ధమాకా. రిలీజ్‌కు ముందు మ్యూజికల్‌గా అంచనాలు పెంచిన ఈ చిత్రం ఓ మోస్తారు అంచనాలతో విడుదలైంది. 23 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి సక్సెస్ టాక్‌తో దూసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు మించి ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.
Video Advertisement
ధమాకా సినిమా ప్రేక్షకులను అలరించడానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోల్స్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. పాటలకు తగినట్టుగా శ్రీలీల వేసిన స్టెప్పులు, ఎప్పటిలానే రవితేజ మేనరిజం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. తన రెండో చిత్రం తోనే శ్రీలీల తనలోని నటిని, డాన్సర్ ని ప్రేక్షకులకి పరిచయం చేసేసింది. అలాగే రెగ్యులర్ కథ అయినప్పటికీ.. త్రినాథ రావు సినిమాను రూపొందించిన విధానం సగటు ప్రేక్షకుడిని కట్టి పడేసిందని చెప్పవచ్చు.
క్రాక్ తర్వాత వచ్చిన రవితేజ చిత్రాలు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ప్లాప్ కావడం తో రవి తేజ ఈ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా అయ్యి రవితేజ క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. ‘ధమాకా’ చిత్రం లో పాత రవి తేజ ని చూసినట్టుందని ఫాన్స్ సంబరపడ్డారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించారు.
అయితే ఈ సూపర్ హిట్ మూవీ లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశారు మేకర్స్. వీటిని గుర్తించిన నెటిజన్లు ఎక్కడ ఎక్కడ ఏం తప్పు చేశారు, ఏ సీన్ ఎక్కడ నుంచి కాపీ కొట్టారో చూపిస్తూ అనేక మీమ్స్ క్రియేట్ చేసారు. అలాగే యూట్యూబ్ లో కూడా ఈ మిస్టేక్స్ కి సంబంధించిన వీడియోలో అప్లోడ్ చేశారు. ఆ మిస్టేక్స్ ఏవో కింద ఉన్న వీడియో లో చూసేయండి..
watch video :