ATM లో డబ్బులు డ్రా చేసేటప్పుడు వచ్చే ఆ సౌండ్…నోట్లు లెక్కపెట్టేది కాదా.? మరేంటి.?

ATM లో డబ్బులు డ్రా చేసేటప్పుడు వచ్చే ఆ సౌండ్…నోట్లు లెక్కపెట్టేది కాదా.? మరేంటి.?

by Mohana Priya

Ads

సాధారణంగా మనిషికి ఓర్పు తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఓర్పు ఎక్కువగా ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి తగ్గిపోతుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఓపికగా ఎదురు చూడాలి. అందులో ఒకటి ఏటీఎం. ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకురావడం ఒక్కొక్కసారి సులభంగా అయిపోయినా కూడా ఒక్కొక్కసారి చాలా సమయం పడుతుంది. దానికి కారణం జనాలు ఎక్కువ మంది ఉండటం అవ్వచ్చు. లేదా ఎటిఎం పని చేయకపోవడం లాంటి సమస్య వచ్చినప్పుడు వేరే ఎటిఎం కి వెళ్లాల్సి రావచ్చు.

Video Advertisement

ఇలా చాలా కారణాల వల్ల ఏటీఎం లో క్యాష్ విత్ డ్రా చేసుకోవడానికి, డిపాజిట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏదేమైనా పని ముఖ్యం కాబట్టి కచ్చితంగా పని అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే. మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా. ఏటీఎం లో  మెషిన్ నుండి క్యాష్ వచ్చేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా?

money counting sound in atm

“ఎందుకు తెలియదు. ఆ సౌండ్ డబ్బులు కౌంట్ చేసేటప్పుడు వస్తుంది”. అనే సమాధానం మీకు రావచ్చు. కానీ అది నిజం కాదు. అంటే ఏటీఎం మిషన్ నుండి వచ్చే సౌండ్ డబ్బులు లెక్క పెట్టేటప్పుడు వచ్చే సౌండ్ కాదు. అది ఒక మెషిన్ జనరేటెడ్ శబ్దం. అలా సౌండ్ జనరేట్ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే. మనం ఏటీఎం కార్డు పెట్టి తీసి, తర్వాత పిన్ ఇంకా మనకి కావాల్సినంత అమౌంట్ ఎంటర్ చేస్తాం. లేదా డిపాజిట్ చేయడానికి డబ్బులని మిషన్ లోకి పెడతాం.

money counting sound in atm

అప్పుడు కొంచెం సేపటికి ఈ సౌండ్ వస్తుంది. అదే సౌండ్ డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు కూడా వస్తుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు మిషన్ ఆగిపోలేదు ప్రాసెసింగ్ అవుతోంది అని మనకి ఒక రిలీఫ్ ఉంటుంది. మనకి డబ్బులు బయటికి వస్తున్నాయి అని భరోసా ఇవ్వడానికే ఆ సౌండ్ జనరేట్ చేస్తారు. అంటే ఇది మెషిన్ వల్ల వచ్చే శబ్దం మాత్రమే కానీ డబ్బులు లెక్క పెట్టడం వల్ల వచ్చే సౌండ్ కాదు.


End of Article

You may also like