69వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తెలుగు హీరోకు రావడంతో టాలీవుడ్ లో సంబరాలు జరుపుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా ఈసారి అత్యధిక అవార్డులు తెలుగు ఇండస్ట్రీకే రావడం విశేషం.

Video Advertisement

ఈ ఏడాది జాతీయ సినీ అవార్డుల్లో ఏడు భాషలు పోటీ పడ్డాయి. 30 చిత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ సినిమాలలో తెలుగు చిత్రాలు సత్తా చాటి, తొలిసారి 10అవార్డులను పొందాయి. అయితే జాతీయ అవార్డులు గెలుచుకున్న విజేతలకు ఇచ్చే నగదు బహుమతి వివరాలు ఇప్పుడు చూద్దాం..
why RRR is the best film..జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అల్లు అర్జున్ కు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించారు. పుష్పరాజ్ మేనరిజం, నటనకు వరల్డ్ వైడ్ గా ప్రశంసలు వచ్చాయి.

  • ఉత్తమ నటుడుగా అవార్డ్ అందుకునే అల్లు అర్జున్ కు రజత్ కమల్ మరియు రూ.రూ.50వేల నగదు బహుమతిగా ఇస్తారు.
  • ఉత్తమ నటిగా అవార్డ్ అందుకునే అలియా భట్‌, కృతిసనన్‌ లకు రజత్ కమలం మరియు రూ.రూ.50వేల నగదు బహుమతిగా ఇస్తారు.
  • ఉత్తమ చిత్రంకు ఎంపిక అయిన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌ (హిందీ)కు స్వర్ణకమలం మరియు దర్శక నిర్మాతలకు కలిపి రూ. 2 లక్షల 50వేలు నగదు బహుమతిగా ఇస్తారు.
  • ఉత్తమ దర్శకుడుగా అవార్డ్ అందుకునే నిఖిల్‌ మహాజన్‌ కు స్వర్ణకమలం మరియు రూ.2 లక్షల 50వేలు నగదు బహుమతిగా ఇస్తారు.
  • ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి స్వర్ణకమలం మరియు దర్శక నిర్మాతలకు కలిపి రూ. 2 లక్షల 50వేలు నగదు బహుమతిగా ఇస్తారు.
  • ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డ్ అందుకునే ప్రేమ్‌రక్షిత్‌ కు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి గాను రజత్ కమలం మరియు రూ.రూ.50వేల నగదు బహుమతిగా ఇస్తారు.
  • ఉత్తమ గీత రచన అవార్డ్ అందుకునే చంద్రబోస్‌ కు కొండపొలం సినిమాకి గాను రజత్ కమలం మరియు రూ.రూ.50వేల నగదు బహుమతిగా ఇస్తారు.Also Read: పుష్ప-2 మూవీ నుండి డైలాగ్ లీక్..! “అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేసి వచ్చావ్..!” అంటూ..?