2022 లో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అయితే ఈ సంవత్సరం ఒకటి మాత్రం గట్టిగా ప్రూవ్ అయ్యింది. అదీ ఏంటి అంటే, ప్రేక్షకులు థియేటర్స్ కి సినిమా కంటెంట్ ను చూసే వస్తున్నారు. స్టార్ వాల్యూని చూసి కాదు అని.

Video Advertisement

అయితే 2023 జనవరి నుంచే సినిమాల సందడి మొదలవనుంది. అయితే ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సినిమాలేవో చూద్దాం..

#1 హరి హర వీర మల్లు

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పవన్ చేస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ టైం ఒక పీరియాడికల్ చిత్రం లో నటిస్తున్నారు పవన్.

most awaited movies in 2023..!!

#2 శంకర్ – రాంచరణ్

స్టార్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు ఫాన్స్. ఈ చిత్రం తో వింటేజ్ శంకర్ తిరిగి వస్తాడని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు.

most awaited movies in 2023..!!

#3 సలార్

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం పై చాలా అంచనాలు ఉన్నాయి.

most awaited movies in 2023..!!

#4 త్రివిక్రమ్ – మహేష్ బాబు

అతడు, ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ మరో సినిమా చేస్తున్నారు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ పై ఇండస్ట్రీ చూపు ఉంది.

most awaited movies in 2023..!!

#5 ఎన్టీఆర్ – కొరటాల శివ

ఎన్టీఆర్ – కొరటాల సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ చిత్రం సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు ఫాన్స్. అంత క్రేజీ కాంబినేషన్ ఇది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది.

most awaited movies in 2023..!!

#6 దసరా

నాచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే తొలిసారి సూపర్ మాస్ లుక్స్ అండ్ మాస్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్.

most awaited movies in 2023..!!

#7 గూఢచారి 2

విలక్షణ నటుడు అడివి శేష్ కి హిట్ ఇచ్చిన చిత్రం గూఢచారి. ఈ చిత్రానికి ఇటీవలే సీక్వెల్ ప్రకటించాడు అడివిశేష్. ఇది కూడా 2023 లోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

most awaited movies in 2023..!!

#8 ప్రాజెక్ట్ కే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం లో దీపికా పాడుకొనే కథానాయిక. ఈ చిత్రం తో దీపికా టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది.

most awaited movies in 2023..!!

#9 పుష్ప 2

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం ఎంత హిట్ అయ్యిందో మనకి తెల్సిందే. దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ పై పాన్ ఇండియా లెవెల్ లో హైప్ ఉంది.

most awaited movies in 2023..!!

#10 ఆదిపురుష్

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారం గా తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం లో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

most awaited movies in 2023..!!

#11 భారతీయుడు 2

స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కలిసి చేస్తున్న చిత్రం భారతీయుడు 2 . భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం లో కాజల్, రకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

most awaited movies in 2023..!!

#12 శాకుంతలం

సమంత హీరోయిన్ గా రాబోతున్న మైథలాజికల్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో దేవమోహన్ దుశ్యంతుడి పాత్రలో, సమంత శకుంతల పాత్రలో నటిస్తున్నారు.

most awaited movies in 2023..!!