“ప్రపంచం” లోనే అతి “ఖరీదైన” 10 వస్తువులు..! వీటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

“ప్రపంచం” లోనే అతి “ఖరీదైన” 10 వస్తువులు..! వీటి ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Megha Varna

Ads

తక్కువ ధరకే అన్నీ మనకి అందుబాటులో వుండవు. బంగారం, వెండి, డైమండ్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఎంతో ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఇలాంటి ఖరీదైనవి ప్రపంచంలో చాలా ఉన్నాయి.

Video Advertisement

అయితే అన్నిటికంటే ఖరీదైన పది విలువైన మెటీరియల్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. వీటి రేటు చూస్తే బాబోయ్ అంటారు.

#1. క్రీమీ డి ల మెర్ (ఒక గ్రాము రూ. 4485.64 ):

ఈ క్రీము ఎంతో ఖరీదైనది. ఒక గ్రాము రూ. 4485.64 అంటే ఎంత ఖరీదైనదో చూడండి మరి.

#2. సోలిరీస్ (ఒక ఫ్లూయిడ్ ఔన్స్ రూ. 10,705.12):

ఇది ఎంతో ఖరీదైన ఫార్మసూటికల్ డ్రగ్. అరుదైన బ్లడ్ డిసార్డర్ లో దీనిని ఉపయోగిస్తారు.

#3. ప్లాటినం (ఒక గ్రాము రూ. 1974.32):

ప్లాటినం ఎంతో ఖరీదైనది. ప్లాటినంతో తయారు చేసిన జువెలరీ ని చాలా మంది వేసుకుంటూ ఉంటారు. అలానే ప్లాటినంని యాంటీ క్యాన్సర్ డ్రగ్ కింద ఉపయోగిస్తారు. క్యాటలిటిక్ కన్వర్టర్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి కూడా ప్లాటినం అవసరం.

#4. ఫ్లూటోనియం (ఒక గ్రాము రూ. 2,56,402):

దీని ధర కూడా ఎంతో ఎక్కువ న్యూక్లియర్ రియాక్టర్ ఆపరేటింగ్ లో ఉపయోగిస్తారు.

#5. టాఫైట్ (గ్రాము రూ. 1,60,256 నుండి రూ. 12,82,010 మధ్య ఉంటుంది):

మెగ్నీషియం, బెరీలియం మరియు అల్యూమినియం తో కలిపి ఉంటుంది. గ్రాము రూ. 1,60,256 నుండి రూ. 12,82,010 మధ్య ఉంటుంది.

#6. తేలు విషం (ఫ్లూయిడ్ ఔన్స్‌ రూ. 6,41,175):

దీని ధర కూడా బాగా ఎక్కువే. ఈ విషంలో లభించే ప్రోటీన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ని తగ్గిస్తాయి. అలానే మల్టిపుల్ స్క్లెరోసిస్‌ను కూడా ఇది తగ్గిస్తుంది.

#7. ట్రిటియం (ఒక గ్రాము రూ. 19,23,525):

ఇది కూడా ఎంతో ఖరీదైనది. ఒక గ్రాము రూ. 19,23,525 అంటే తక్కువా..?

#8. కాలిఫోర్నియమ్-252 (ఒక గ్రాము 1,73,11,72,500):

ల్యాండ్ మైన్స్ ని కనుగొనడానికి, క్యాన్సర్ ట్రీట్మెంట్ కి కాలిఫోర్నియమ్-252 ని ఉపయోగిస్తారు.

 

#9. డైమండ్ (గ్రాము రూ. 41,67,637):

డైమండ్స్ కూడా ఎంతో ఖరీదైనవే. చాలా మంది డైమండ్ రింగ్స్, చైన్స్ మొదలైన వాటిని వేసుకుంటూ వుంటారు.

#10. యాంటీమాటర్ (గ్రాము రూ. 6,414,000,000,000,000):

యాంటీమాటర్ కూడా చాలా ఖరీదైనది. గ్రాము రూ. 6,414,000,000,000,000.


End of Article

You may also like