Ads
జీవితం లో పెళ్లి ఒక అందమైన మలుపు. పెళ్లి అందరి జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. ముఖ్యం గా అమ్మాయిల జీవితాన్నిపెళ్లి ఒక్కసారిగా మార్చేస్తుంది. అందుకే ఈ విషయం లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో ఓ రకమైన భయం ఉంటుంది. అలాగే అత్తారింటికి వెళ్లిన తర్వాత ఎలా ఉంటుందో అని ఆందోళన పడుతూ ఉంటారు అమ్మాయిలు. ఇలా పెళ్లితో అమ్మాయిలకు ఎన్నో టెన్షన్స్ వస్తాయి.
Video Advertisement
పెళ్లి తర్వాత కొత్త వాతావరణానికి తగ్గట్టుగా మారేందుకు అమ్మాయిలకు చాలా సమయం పడుతుంది. అదే సమయం లో బాధ్యతలు పెరుగుతాయి. ఒకవేళ ఉద్యోగాలు చేసే వారైతే మరింత ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ పితృ స్వామ్య వ్యవస్థలో అమ్మాయిలకు పెళ్లి అయ్యాక అనేక కండిషన్స్ పెడుతున్నారు. అలా ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆమె అత్తారింట్లో పెట్టిన కండిషన్స్ లిస్ట్ ఒకటి ఇంటర్ నెట్ లో వైరల్ అవుతోంది.
పెళ్లి అవకా ముందు అబ్బాయిలు అంతకు ముందు ఉన్నట్టుగానే పెళ్లయ్యాక కూడా ఉంటారు. కానీ అమ్మాయిలు పెళ్ళైన తర్వాత రోజు నుంచే బాధ్యతలు తలకెత్తుకోవాలి అనుకుంటారు. అలాంటి పోస్ట్ ఒకటి ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఒక వివాదం తర్వాత తమ కోడలిని తిరిగి అత్తారింటి లోకి మళ్ళీ రావాలి అంటే కొన్ని కండిషన్లు పెట్టారు ఈ అత్తామామలు. ఆ లిస్ట్ బేసిక్ గా తమిళ్ లో ఉంది. కానీ వాటిని ఇంగ్లీష్ లోకి అనువదించి ఆ పోస్ట్ పెట్టారు.
అందులో భార్యకు మెయిన్ గేట్ కీ ఇవ్వకూడదు, రోజు ఎనిమిది గంటలకు పనులన్నీ పూర్తి కావాలి, ఒంట్లో బాగోక పోతే భర్తకు చెప్పకూడదు, ఆమె పుట్టింటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు లాంటి పదికి పైగా కండిషన్స్ ఆ కోడలికి పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తన కుటుంబాన్ని వదిలి, భర్తతో సంతోషం గా జీవించాలని వచ్చిన ఒక అమ్మాయికి ఇటువంటి షరతులు విధించడాన్ని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఈ సమాజం లోని గడ్డు పరిస్థితులకు ఈ పోస్ట్ అద్దం పడుతోందని కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి నిబంధనలు ఒక పురుషుడికి ఎందుకు వర్తించవు అని ప్రశ్నిస్తున్నారు. కనీసం తన తల్లిదండ్రులను కలిసే హక్కు కూడా ఒక మహిళకు లేదా విమర్శిస్తున్నారు.
End of Article