పెళ్లి కాబోతున్న కొడుక్కి తల్లి ఈ 5 విషయాలు మర్చిపోకుండా చెప్పాలి..!

పెళ్లి కాబోతున్న కొడుక్కి తల్లి ఈ 5 విషయాలు మర్చిపోకుండా చెప్పాలి..!

by Megha Varna

Ads

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే కొడుక్కి పెళ్లి అయ్యే ముందు తల్లి తప్పకుండా ఈ విషయాలన్నీ చెప్పాలి. కేవలం అమ్మాయికి మాత్రమే అవసరమైన విషయాలు చెప్తే సరిపోదు. అబ్బాయిలకు కూడా తల్లిదండ్రులు సందర్భాన్ని బట్టి చెప్పాల్సిన విషయాలు చెప్పేయాలి. పెళ్లికి ముందు మాత్రం తల్లి తప్పకుండా ఈ 5 విషయాలు కొడుకుకి చెప్పాలి.

Video Advertisement

1. ఎప్పుడూ కూడా తల్లితో భార్యని పోల్చకూడదు. తల్లి వేరు భార్య వేరు. నిన్ను నేను ఎలా పెంచానో ఆ విధంగా అల్లారుముద్దుగా అరచేతిలో పెట్టుకుని నీవు నీ భార్యను చూసుకో.

Things that a mother should tell her son before getting married

2. భార్య నీకు తల్లి కాదు. ఆమెకు మంచి స్నేహితురాలు. అందర్నీ వదులుకుని ఆమె నీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది. అయితే నీ తల్లికి నిన్ను పోషించడం మాత్రమే ముఖ్యం. కానీ నీ భార్యకి ఆలనా పాలన కూడా అవసరం. మీరు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి.

3. కష్టసుఖాల్లో, నష్టాల్లో అన్నిటిలో నీ భార్య నీకు తోడుగా ఉంటుంది. నీవు వేసే ప్రతి అడుగు కూడా ఆమె సహకారం అందిస్తుంది. ఎప్పుడూ కూడా ప్రేమానురాగాలు పంచే వ్యక్తితో ఏదీ దాయకూడదు. దాంపత్యంలో స్వార్థం అనేది నిజంగా తప్పు.

4 . అన్నింట్లో నీ భార్యకు నీవు సహకరించాలి. ఆమె నీ కోసం ఎన్నో వదులుకొని వచ్చింది అందుకని నువ్వు తాను పుట్టింట్లో ఎలా సంతోషంగా ఉందో అలాంటి సంతోషాన్ని ఇవ్వాలి.

5. భార్యను ప్రేమించడానికి వయసు పరిమితి లేదు. ఎల్లప్పుడూ కూడా ఆమెను సంతోషంగా ఉంచాలి. మీ ఇద్దరు ప్రేమానురాగాలతో ఎల్లప్పుడూ ఉండాలి. గుర్తుంచుకో మీ నాన్న నన్ను ఎలా ప్రేమానురాగాలతో సుఖసంతోషాలతో నడిపించుతున్నారో.. నువ్వు కూడా అదే విధంగా ఆమెని నడిపించాలి. మన వంశాన్ని వృద్ధిలోకి తెచ్చి గొప్పగా మీరు ఉండాలి.


End of Article

You may also like