మా తుఝే సలాం..! కొడుకు కోసం స్కూటీపై 1400 కిలోమీటర్ల ప్రయాణం.!

మా తుఝే సలాం..! కొడుకు కోసం స్కూటీపై 1400 కిలోమీటర్ల ప్రయాణం.!

by Anudeep

Ads

దేవుడు ప్రతి చోట తానుండ లేక  అమ్మని సృష్టించాడంటారు . ప్రపంచంలో అమ్మ ప్రేమని మించింది లేదు.. అమ్మ ప్రేమని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు . తన పిల్లలు కష్టంలో ఉన్నారంటే ఏ తల్లైనా చూస్తూ ఊరుకోలేదు. మొన్నటికి మొన్న ఎక్కడో ఉన్న నా బిడ్డ ఆకలి ఒక తల్లి తీర్చకపోదా అని తన పొలంలో పండిన బియ్యంలో కొన్నింటిని పేదవారికి పంచమని కలెక్టర్ కి అందచేసింది ఒక పేద తల్లి, తన పెద్ద మనసు చాటుకుంది . ఈ రోజు ఇంకో తల్లి ఏకంగా తన కొడుకు కోసం మైళ్ల దూరం వెళ్లింది.

Video Advertisement

బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌ గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మరణించడంతో అప్పటినుంచి పిల్లల బాధ్యత ఒక్కర్తే చూస్తోంది..చిన్నవాడైన మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు బోధన్‌లో ఇంటర్‌ చదివాడు. అతడి ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షల కోసం గత నెల హైదరాబాద్ కి వచ్చాడు. అక్కడి నుండి ఇద్దరు బోధన్ కి వచ్చారు.

ఈ లోపు తన స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అతడికి తోడుగా నిజాముద్దీన్‌  కూడా నెల్లూరుకు వెళ్లాడు. అక్కడి  నుండి ఒక దర్గాకి వెళ్లారు .ఇదంతా జరిగింది మార్చి నెలలో, లాక్ డౌన్ కి సరిగ్గా రెండు మూడు రోజుల ముందు.కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్ డౌనే మార్గమని ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అంతే నిజాముద్దీన్ రావడానికి బస్సులు, ప్రైవేట్ వెహికిల్స్ లాంటి ఏ రవాణా సౌకర్యాలు లేవు.. కొడుకు ఏకంగా వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయాడు. అక్కడ నుండి ఎలా వస్తాడు అని రజియాబేగం తల్లడిల్లిపోయింది. పరిస్థితి చూస్తే బాగలేదు.

తన కొడుకుని రప్పించుకోవడానికి అనేక మార్గాలు ఆలోచించింది, ఏ వైపునుండి కూడా సాయం రాలేదు. దాంతో తనే తన కొడుకుని ఇంటికి తెచ్చుకోవాలనుకుంది. బోధన్‌ ఏసీపీని కలిసి పరిస్థితిని వివరించి, పర్మిషన్ లెటర్ తీసుకకుంది. లెటర్‌ తీసుకుని, 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు సోమవారం ఉదయం స్కూటీపై బయల్దేరింది. మంగళవారం మధ్యాహ్ననాకి అక్కడికి చేరుకుంది.కొడుకుని చూసి ఆ తల్లి మనసు కొంచెం తేలిక పడింది. తల్లి కొడుకులిద్దరు అదే స్కూటీపై సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం మధ్యాహ్నం వారు కామారెడ్డికి చేరుకున్నారు .

అటు ఏడువందల కి.మి, ఇటు ఏడు వందల కి.మీ మొత్తం 1400కిమి ప్రయాణించి ఎట్టకేలకు కొడుకుని క్షేమంగా ఇంటికి తెచ్చేసుకుంది. వచ్చిన తర్వాత విలేకరులు అడిగినప్పుడు ఈ విషయం అంతా చెప్పుకొచ్చింది రజియా, వెళ్తున్న దారిలో అనేక సార్లు పోలీసులు ఆపారని లెటర్ వలనే ముందుకు పోనిచ్చారని  తనకు లెటర్ ఇచ్చిన ఏసిపి కి థాంక్స్ చెప్పింది.. నిజంగా మానవత్వం ఇంకా మిగిలి ఉంది అని ఇలాంటి వార్తలే రుజువు చేస్తాయి. మన గుండెలోతుల్లో మిగిలి ఉన్న తడిని తట్టి లేపుతాయి.. రియల్లీ హాట్సాఫ్ హెర్..తనకి సహకరించిన పోలీసులకి సెల్యూట్.

Also Read >>>లాక్ డౌన్ లో పనిచేస్తున్న ఈ 10 డిపార్టుమెంట్స్ వారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి.


End of Article

You may also like