4 వ్యక్తులు… 4 జీవితాలు… ఒకే కథ..! ఈ సినిమా చూశారా..?

4 వ్యక్తులు… 4 జీవితాలు… ఒకే కథ..! ఈ సినిమా చూశారా..?

by Harika

Ads

సాధారణంగా సినిమాలు అన్న తర్వాత ఒక సినిమాలో ఒకే కథ ఉంటుంది. కానీ కొన్ని సినిమాల్లో వేరు వేరు కథలు ఒకటే సమయంలో నడుస్తూ ఉంటాయి. వాటన్నిటినీ చివరికి తీసుకొచ్చి కలుపుతారు. అలా నలుగురు వ్యక్తుల కథలతో వచ్చిన ఒక సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో నటించిన నటుడికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. సూపర్ డీలక్స్. 2019 లో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమాలో హీరో లేడీ గెటప్ లో కనిపించడం అంటే చిన్న విషయం కాదు. కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాలో శిల్ప అనే ఒక అమ్మాయి పాత్రలో నటించారు.

Video Advertisement

movie based on various people lives

త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. త్యాగరాజన్ కుమార రాజా, ఎస్ డి ఎళిల్మతి కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మాణిక్యం (విజయ్ సేతుపతి )గా ఉన్న వ్యక్తి, తర్వాత శిల్పగా మారి ఇంటికి వెళ్తాడు. అప్పటికే అతనికి ఒక కొడుకు ఉంటాడు. అతని కుటుంబం అంతా కూడా అతను చేసిన పనికి బాధపడుతూ ఉంటారు. వేంబు (సమంత) కి, ముగిల్ (ఫహద్ ఫాజిల్) అనే వ్యక్తితో పెద్దలు పెళ్లి జరిపిస్తారు. కానీ వేంబుకి ముందే ఒక అబ్బాయి అంటే ఇష్టం ఉంటుంది.

movie based on various people lives

లీల (రమ్య కృష్ణన్) కొడుకుకి ఆమె చేసిన ఒక పనికి కోపం వస్తుంది. బాలాజీ అలియాస్ గాజి (విజయ్ రామ్) కి ఒక అమ్మాయి (మృణాళిని రవి) అంటే ఇష్టం ఉంటుంది. కానీ తర్వాత ఆ అమ్మాయి ఏలియన్ అని తెలుస్తుంది. ఈ నలుగురు వ్యక్తుల జీవితాలు ఎలా కలిశాయి అనేది మిగిలిన కథ. ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ సినిమాని ప్రదర్శించారు. సినిమాలో నటించిన వాళ్లందరికీ కూడా చాలా మంచి పేరు వచ్చింది. సమాజంలో జరిగే ఎన్నో విషయాల మీద ఈ సినిమాలో మాట్లాడారు. ముఖ్యంగా శిల్ప ఎదుర్కొనే సంఘటనలని ఈ సినిమాలో చూపించారు. శిల్ప పాత్రలో విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ ప్రేక్షకులని కంటతడి పెట్టిస్తుంది. అంత బాగా పర్ఫార్మ్ చేశాక అవార్డ్స్ రాకుండా ఉంటాయా.

movie based on various people lives

ఆ సంవత్సరం ఏ సినిమా వేడుక జరిగినా కూడా, అందులో విజయ్ సేతుపతికి సూపర్ డీలక్స్ సినిమాకి అవార్డు వచ్చింది. అవన్నీ మాత్రమే కాకుండా, సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది, సినిమాలో నటించిన విజయ్ సేతుపతికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కాబట్టి, జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తమిళ్ లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా ఇప్పటి వరకు రాలేదు అంటూ మెచ్చుకున్నారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప సినిమాగా ఇది నిలుస్తుంది అని కామెంట్స్ చేశారు.

ALSO READ : 50 కి దగ్గరగా ఉన్నా…పెళ్లి చేసుకోని 10 మంది హీరోయిన్స్.! ఒకొక్కరికి ఒకో కారణం.!


End of Article

You may also like