Ads
ఇటీవల ఒక మలయాళం నుండి తెలుగుకి డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన సినిమా గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా ప్రేమలు. ఇప్పుడు ఇదే సినిమా ఆహాలో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఇప్పుడు కూడా ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ తరహా జోనర్ సినిమాలు ఇంకా ఏవేవి ఉన్నాయి అని తెలుసుకోవడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా డైరెక్టర్ గిరీష్ దర్శకత్వం వహించిన మరొక సినిమా ఇంతకంటే చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా పేరు సూపర్ శరణ్య. పేరు వినడానికి ఎంత కామెడీగా ఉందో, సినిమా అంతకంటే ఎక్కువ కామెడీగా ఉంటుంది. ఈ సినిమా శరణ్య అనే ఒక టీనేజ్ అమ్మాయి మీద తీశారు.
Video Advertisement
టీనేజ్ సమయంలో ఒక అమ్మాయి ఎదుర్కొనే సంఘటనలని చాలా కామెడీగా చూపించారు. హాస్టల్ లో ఆ అమ్మాయికి ఒక గ్యాంగ్, వాళ్ళు చేసే అల్లరి అదంతా కూడా చాలా బాగా ఈ సినిమాలో చూపించారు. ప్రేమలు సినిమా నచ్చినట్టు అయితే, ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించగా, ప్రేమలు సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. జీ ఫైవ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మలయాళం భాషలో ఈ సినిమా అందుబాటులో ఉంది. జస్టిన్ వర్గీస్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో నటించిన వారి నటన కూడా చాలా అమాయకంగా ఉంటూనే, కామెడీ తెప్పిస్తుంది. ప్రేమలు సినిమా లాగానే ఈ సినిమా స్టోరీ కూడా సింపుల్ గానే ఉంటుంది. కాకపోతే టేకింగ్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా మొదటి నుండి చివరి వరకు నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. ముఖ్యంగా కాలేజ్ సమయంలో హాస్టల్ లో ఉన్నవారు అయితే చాలా సీన్స్ కి రిలేట్ కూడా అవుతారు. వారం వారం తమ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత మళ్లీ హాస్టల్ కి రావడం అవన్నీ కూడా ఇందులో బాగా చూపించారు. చాలా సీన్స్ సహజత్వానికి దగ్గరగా తీశారు.
End of Article