టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న స్టార్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.ఈయన ప్రొడ్యూసర్ గా మంచి విజయం సాధించాడు. ఈయన చేసే ప్రతీ సినిమా తన లెక్కల ప్రకారం బడ్జెట్ వేస్తూ ఎక్కడ లెక్క తప్పకుండ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గత 20 ఏళ్ళ నుంచి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ నిర్మిస్తూ టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు.
Video Advertisement
తన ప్రయాణాన్ని డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభించి అనంతరం నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయ్యారు దిల్ రాజు. చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి లాభాలను అందుకున్నటువంటి దిల్ రాజు నేడు ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగారు దిల్ రాజు.
దిల్ రాజు ఒక సినిమాలో కథని ఎక్కువగా నమ్ముతారు కానీ కాంబినేషన్స్ ని.. భారీ బడ్జెట్ సెటప్పులని పెద్దగా పట్టించుకోరు. దిల్ రాజు కి సినిమాలు ఎలా చేయాలి ఎంత బడ్జెట్ లో చేయాలి అనే విషయం చాలా బాగా తెలుసు అందుకే ఆయన ఎంత బడ్జెట్ లో సినిమా చేసిన కూడా దానికి తగ్గ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. ఎవరితో ఏ రకంగా ప్రమోషన్స్ చేపిస్తే సినిమాకి ప్లస్ అవుతుంది అనే విషయాల్లో దిల్ రాజు చాలా క్లారిటీ గా ఉంటారు.
అయితే 50 ఏళ్ళ వయసులో కూడా చూడటానికి ఎంతో ఉత్సాహంగా, హ్యాండ్సమ్ గా కనిపించే దిల్ రాజు ఒక చిత్రం లో నటించారన్న విషయం మీకు తెలుసా..?? దిల్ రాజు నిర్మాతగా నాని ఎంసీఏ మూవీ లో నటించారు. ఈ మూవీ లో ఒక చోట దిల్ రాజు నటించారు.
నాని, సాయి పల్లవి తమ వదినకి తెలియకుండా ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరోజు వాళ్లిద్దరూ కలిసి బస్సు లో వెళ్తున్న సమయం లో భూమిక బస్సు చెకింగ్ చేయడం కోసం ఆపుతారు. అప్పుడు నాని కూర్చున్న సీట్ కి రెండు సీట్స్ ముందు దిల్ రాజు కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆ సీన్ లో దిల్ రాజు నటించారు కానీ సినిమాలో మాత్రం ఆ సీన్ లో ఆయన కనిపించరు. దీంతో ప్రస్తుతం ఆ సీన్ కి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
ఇక దిల్ రాజు ఇటీవలే బలగంతో హిట్ కొట్టారు. అలాగే సమంత నటించిన శాకుంతలం చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా , డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న గేమ్ చేంజర్ మూవీని నిర్మిస్తున్నారు.దీనికోసం వంద కోట్లకు పైగానే బడ్జెట్‌ను పెడుతున్నారు. అలాగే కల్యాణ్ రామ్‌తోనూ ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు.