బలగం సినిమాలాగానే సెన్సేషన్ అయ్యింది..? ఈ సినిమా చూశారా..?

బలగం సినిమాలాగానే సెన్సేషన్ అయ్యింది..? ఈ సినిమా చూశారా..?

by Anudeep

Ads

మసూద సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు తిరువీర్ . ఘాజీ, మల్లేశం, జార్జిరెడ్డి, ‘పలాస’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తిరువీర్. మసూద’ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు .

Video Advertisement

ఇక ఇప్పుడు పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. సోనీ లీవ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

Pareshan movie-story-review-rating

క్రైస్తవుడైన సమర్పణ్‌(మురళీధర్‌ గౌడ్‌) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్‌ (తిరువీర్‌) ఒక తిరుగుబోతు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు సమర్పణ్‌. ఇందుకోసం అధికారులకు రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. దీంతో ఐజాక్ విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కకుంటాడు. ఇంతకీ ఆ డబ్బు అధికారులకు ఇచ్చాడా? మధ్యలో ఐజాక్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? మధ్యలో అతడి గర్ల్ ఫ్రెండ్ గర్భవతి అని తెలుస్తుంది. ఇక ఆ డబ్బు ఎవరు కొట్టేశారు అనేది మిగిలిన కథ..

Pareshan movie-story-review-rating

ఈ మధ్య చాలా సినిమాల్లో తెలంగాణ కల్చర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ సినిమాలు కూడా ప్రేక్షకులు బాగానే ఆకట్టుకున్నాయి కూడా. ఇక పరేషాన్‌ కూడా అదే కోవలోకి వస్తుంది. తెలంగాణ నేటివీటీతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ క‌థ‌లో ఏమాత్రం కొత్త‌దనాన్ని చూపించ‌లేక‌పోయాడు. ఆ విష‌యంలో మ‌రింత వ‌ర్క్ చేసి ఉంటే సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది.

ప‌ని పాట లేకుండా తిరిగే కొడుకు..అత‌న్ని తిట్టే తండ్రి..మ‌ధ్య‌లో ప్రేమ‌క‌థ‌.. ఇలాంటి నేప‌థ్యంలో ఇంత వ‌ర‌కు చాలా క‌థ‌లే వ‌చ్చాయి. ఇందులో కొత్తేముంది. ఇదే ఈ సినిమాకు ప్ర‌ధాన మైన‌స్‌గా మారింది. ఎమోషనల్‌ సీన్స్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఫ‌న్‌ని జ‌న‌రేట్ చేస్తూ ద‌ర్శ‌కుడు న‌డిపించిన విధానం బాగానే ఉన్నా క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం ప్ర‌ధాన మైన‌స్‌గా మారింది. దీంతో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది.

 

కానీ సినిమాలో తిరువీర్‌ నటన చాలా బాగుంది. తన సహజమైన, అమాయకమైన నటనతో మెప్పించాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఇక అర్జున్‌ కృష్ణ, రవి, బన్ని అభిరామ్‌ కూడా తమ పాత్ర మేరకు బాగా నటించారు. వాసు పెండమ్‌ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. అయితే థియేటర్లలో యావరేజ్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో వచ్చింది. మరి ఇందులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

ALSO READ : “ప్రియాంక మోహన్” కి ఏమయ్యింది..? ఇలా అయిపోయారేంటి..?


End of Article

You may also like