40 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తయింది… కానీ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా.?

40 ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తయింది… కానీ ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా.?

by Anudeep

Ads

సినీ పరిశ్రమ లో ప్రతి సినిమా దాని నిర్మాణం పూర్తయిన తర్వాత కొని అనివార్య కారణాల వల్ల తరచుగా కొంత ఆలస్యం అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పనులు పూర్తి అవ్వడానికి ఒక్కో సారి అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అవ్వడానికి అనుకున్న టైమ్ కంటే ఆలస్యం అవుతాయి.

Video Advertisement

కానీ ఒక సినిమా ఏకంగా పూర్తి ఆయిన 40 సంవత్సరాల అనంతరం థియేటర్లలో రిలీజ్ అయ్యి సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా ఏంటి ..అది ఎందుకు అని సంవత్సరాలు వాయిదా పడిందా అని ఆశ్చర్యపోతున్నారా……అయితే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా.

తెలుగు చిత్ర పరిశ్రమ కు గుర్తింపు తెచ్చిన అలనాటి అగ్రకథానాయకులలో అక్కినేని నాగేశ్వర్ రావు ఒకరు. టాలీవుడ్ లో అక్కినేని ఇంటి పేరును ఒక బ్రాండ్ గా మార్చిన ఘనత ANR కే దక్కుతుంది.ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీ కి భారీ హిట్ లు అందించిన నాగేశ్వర్ రావు కు తెలుగునాట అభిమానులకు కొదవ లేదు. అలాంటి ANR నటించిన ఒక చిత్రం చిత్రీకరణ పూర్తి అయిన ఇంక రిలీజ్ కాలేదని…..ఇప్పుడు సుమారు 40 సంవత్సారాలు తర్వాత రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది అని చెబితే మీరు నమ్ముతారా…?

అవునండి …ఇది నిజం అక్షర సత్యం. వివరాల్లోకి వెళితే…. అక్కినేని నాగేశ్వర రావు జయసుధ తో కలిసి నటించిన చిత్రం ప్రతిబింబాలు 1982 లో నిర్మించబడింది. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు, కెఎస్ ప్రకాష్ రావులు దర్శకత్వం వహించారు. కానీ ఈ చిత్రం కొని కారణాలవల్ల షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా వచ్చేసెప్టెంబర్ నెల 20 వ తేదీన నాగేశ్వర్ రావు గారి జయంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కి సిద్ధం అయింది.

ఈ మధ్య ఈ చిత్ర నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ…అనుకొని కొన్ని కారణాల వల్ల అపట్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేక పోయామని ఇప్పుడు సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి సందర్భంగా,నేటితరం మెచ్చేలా సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాము అని పేర్కొన్నారు. ఎంత ఆధునికత పెరిగిన,ANR చిత్రం మాత్రం తప్పకుండా భారీ విజయం సాధించి తీరుతుంది అని దృఢంగా నమ్ముతునట్లు చెప్పారు.


End of Article

You may also like