టాలీవుడ్ కు సంక్రాంతి ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఈ ఫెస్టివల్లో కాస్త పాజిటివ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకుంటాయి. అందుకే ప్రతిసారి కూడా పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా సినిమాలను పండుగ సమయం లోనే విడుదల చేస్తూ ఉంటారు మేకర్స్. ఈ సారి సంక్రాంతికి కూడా చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.

Video Advertisement

గత రెండేళ్లుగా సంక్రాంతి సినిమా సమరం అంతగా లేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో పెద్ద చిత్రాల మధ్య పోటీ లేకుండా పోయింది. అయితే 2023 మాత్రం అతిపెద్ద బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతుందని తెలుస్తోంది. ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ వాల్తేరు వీరయ్య’. నటసింహం బాల కృష్ణ నటించిన ‘వీర సింహ రెడ్డి’ చిత్రాలు బరిలో ఉన్నాయి. చాలా కలం తర్వాత ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయం లో విడుదల కానుండటం తో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

who is going to win this pongal season..??

ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈ ఇద్దరి హీరోల చిత్రాలు తలపడ్డాయి. అయితే చెరో నాలుగు సార్లు ఇద్దరు విజయాలు నమోదు చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు తమకు అచ్చోచ్చిన జానర్ లోనే రాబోతున్నారు. చిరు మాస్ లుక్ లో సందడి చేస్తుంటే.. బాలయ్య రాయల సీమ నేపథ్యం లో రానున్నారు. అయితే ప్రస్తుతానికి ఆడియో పరం గా చిరంజీవి ముందున్నా.. బాలయ్య వీర సింహ రెడ్డి కే పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి.

 

who is going to win this pongal season..??
అఖండ హిట్ తో బాలయ్య జోష్ లో ఉంటే.. గాడ్ ఫాదర్ చిత్రం కమర్షియల్ గా హిట్ కాకపోవడంతో చిరు ఈ సినిమా పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ రెండు బడా చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ విషయం లో అంత స్పీడ్ గా లేరు. మరి ఈ రెండిటిలో ఏ చిత్రం విజయం సాధిస్తుందో చూడాలి. మరో వైపు సంక్రాంతి బరిలో విజయ్ వారసుడు చిత్రం కూడా ఉంది. దీని నిర్మాత దిల్ రాజు ప్రమోషన్స్ చాలా వేగం గా చేస్తూ ఈ సినిమా పై బజ్ ని పెంచుతున్నారు.