౩౩ ఏళ్ళ కిందట వచ్చిన సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు..? అంత గొప్ప చరిత్ర ఉందా..?

౩౩ ఏళ్ళ కిందట వచ్చిన సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు..? అంత గొప్ప చరిత్ర ఉందా..?

by Mohana Priya

Ads

సాధారణంగా సినిమాలకి టైం అనేది ఉండదు. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే, అందులో చాలా సినిమాల గురించి ప్రేక్షకులకి తెలుసు. మన తెలుగులో అలాంటి గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. అయితే, అలా ఇప్పుడు 91 లో రిలీజ్ అయిన ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చేసిన సాహసం తెలియలేదు.

Video Advertisement

movie which became a topic of discussion

కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి మరొక సినిమా వచ్చిన తర్వాత, ఆ సమయంలో వాళ్ళు చేసిన రిస్క్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా గుణ. కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. గుణ అనగానే, “కమ్మని ఈ ప్రేమ లేఖనే” అనే పాట చాలా మందికి గుర్తొస్తుంది.  సినిమా చూసిన వాళ్ళ కంటే కూడా, ఈ పాట విన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అసలు ఈ సినిమా కూడా ఈ పాట ద్వారానే చాలా మందికి తెలుసు. గతంలో ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో నాని ఒక ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో ఈ పాట పాడుతారు. అప్పుడు ఈ పాట ఫేమస్ అయ్యింది.

movie which became a topic of discussion

ఇప్పుడు మళ్లీ ఈ సినిమా మంజుమ్మల్ బాయ్స్ సినిమా ద్వారా ఫేమస్ అయ్యింది. దాంతో సినిమా గురించి కూడా అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. గుణ కేవ్స్ లో ఆ సమయంలోనే అంత సాహసం చేసి ఆ సినిమా షూట్ చేశారు. సంతాన భారతి దర్శకత్వం వహించిన ఆ సినిమాకి, ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు. రోషిని ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు. నటి విజయరేఖ కూడా మరొక ముఖ్య పాత్రలో నటించారు.

movie which became a topic of discussion

ఏదైనా ఒక సినిమా కోసం బాగా కష్టపడితే, ఆ కష్టానికి ఆ సమయంలో ఫలితం రాకపోయినా కూడా, ఆ తర్వాత తప్పకుండా ఫలితం ఉంటుంది. వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆ సమయం కోసం వేచి చూడాలి అంతే. సినిమా విడుదల అయిన 33 సంవత్సరాలకి ఇప్పుడు ఈ సినిమా ఘనత అందరికీ తెలిసింది. దీని గొప్పదనం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలోనే వీళ్ళు అలాంటి ప్రదేశానికి వెళ్లి షూట్ చేయడం అనేది చాలా గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : 39 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెలా సాధ్యం..?


End of Article

You may also like