ఈ సినిమాకి 6 జాతీయ అవార్డులు వచ్చాయా..? అంతగా ఏం ఉంది ఇందులో..?

ఈ సినిమాకి 6 జాతీయ అవార్డులు వచ్చాయా..? అంతగా ఏం ఉంది ఇందులో..?

by Harika

Ads

సినిమా బాగుంటే అవార్డులు వస్తాయి. కొన్ని సినిమాలు మరీ బాగుంటే చాలా ఎక్కువ అవార్డులు వస్తాయి. అలా ఒక సినిమాకి 6 జాతీయ అవార్డులు వచ్చాయి. సాధారణంగా ఒక సినిమాకి ఒక జాతీయ అవార్డు వచ్చింది అంటేనే చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక సినిమాకి ఆరు జాతీయ అవార్డులు వచ్చాయి అంటే ఆ సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మనమే అర్థం చేసుకోవాలి. ఆ సినిమా పేరు ఆడుకలం. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో, తాప్సి హీరోయిన్ గా నటించారు. 10 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. 2011లో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది ప్రశంసలు అందుకుంది.

Video Advertisement


movie which got many national awards

వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎస్ కతిరేశన్ ఈ సినిమాని నిర్మించారు. కోళ్ల పందాలు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. చెప్పడానికి సినిమా లైన్ మామూలుగా అనిపించినా కూడా తెర మీద చాలా బాగా చూపించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో పందెం కోళ్ళు పేరుతో విడుదల అయ్యింది. ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకి ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ కొరియోగ్రఫీ, ప్రత్యేక జ్యూరీ అవార్డు విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా తర్వాత ధనుష్ అంతర్జాతీయ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.


movie which got many national awards

ధనుష్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నారు అనేది ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఆ తర్వాత ధనుష్ కి ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం ధనుష్ కెరీర్ లోనే ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. ధనుష్ కి మాత్రమే కాదు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి చాలా మంచి పేరు వచ్చింది. జాతీయ అవార్డులు మాత్రమే కాకుండా, ఆ సంవత్సరం ఇంకా ఎన్నో సంస్థలు ప్రధానం చేసిన అవార్డులు ఈ సినిమా అందుకుంది. సినిమాలో కమర్షియల్ అంశాలు పెద్దగా ఉండవు. కానీ సినిమా కంటెంట్ పరంగా చాలా బలంగా ఉంటుంది. టేకింగ్ పరంగా ఇంకా బలంగా ఉంటుంది. అందుకే అందరూ ఈ సినిమాని అంత పొగిడారు. ఈ సినిమా ఈ కారణంగానే అన్ని అవార్డులు కూడా అందుకుంది.

ALSO READ : ఇలాంటి సీన్ చేసే ధైర్యం ఏ తెలుగు హీరోకి అయినా ఉందా..? విషయం ఏంటంటే..?


End of Article

You may also like