నేషనల్ అవార్డ్ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి..! ఈ సినిమా చూశారా..?

నేషనల్ అవార్డ్ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్‌, ఫాలోయింగ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ కాన్సెప్టులతో, చాలా సహజంగా, తెరకెక్కే ఈ చిత్రాలకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఎలాంటి నాటకీయత లేకుండా, ఎమోషన్స్‌కు ప్రాముఖ్యతను ఇచ్చే మాలీవుడ్‌ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది.

Video Advertisement

ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాలకు ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారు. హోమ్ అనే మలయాళ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం 69 వ నేషనల్ అవార్డ్ లో బెస్ట్ మలయాళ చిత్రంగా అవార్డ్ ను కూడా అందుకుంది. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో? ఆ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఫీల్ గుడ్ మలయాళ మూవీ ‘హోమ్’ కి రోజిన్ థామస్ దర్శకత్వం వహించారు. ఇంద్రన్స్, మంజు పిళ్లై, శ్రీనాథ్ భాసి, దీపా థామస్, నస్లెన్ కె. గఫూర్, జానీ ఆంటోని, కైనకరి థంకరాజ్ వంటివారు ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021లో ఆగస్టు 19న విడుదలైంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, 60 ఏళ్ల ఒలివర్ ట్విస్ట్ (ఇంద్రాన్స్)ఇద్దరు కొడుకులకు తండ్రి. పెద్ద కొడుకు ఆంటోనీ (శ్రీనాథ్ బాసి), చిన్న కొడుకు చార్లెస్( నస్లెన్ కె. గఫూర్). ఆంటోనీ దర్శకుడు. అతను తీసిన మొదటి మూవీ పెద్ద విజయం సాదిస్తుంది. కానీ కానీ రెండవ మూవీకి స్టోరీ రాయలేక, ఏకాగ్రత కుదరక ఇబ్బందులు పడతాడు. మవతి మూవీ కథ రాసిన తన ఇంట్లోనే రాయాలని భావించి, ఇంటికి వస్తాడు. పెద్ద కొడుకు ఇంటికి రావడంతో ఒలివర్ చాలా సంతోషపడతాడు. తన మిత్రులతో ఆంటోనీ గురించి గొప్పగా చెప్పుకుని ఆనందపడతాడు.
అయితే ఆంటోనీ మాత్రం తన తండ్రి ఒలివర్ తో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడడు. ఎల్లప్పుడు ఫోన్‌ చూస్తూ ఉంటాడు.తండ్రి ఏం మాట్లాడినా ఫోన్ చూసుకుంటూ ఆంటోనీ ‘ఊ ఊ’ అని అంటుంటాడు. అయితే తన కొడకులు ఇద్దరు ఎందుకు ఆ స్మార్ట్ ఫోన్‌కి బానిసలా మారి, తమ చుట్టూ ఉన్నవాళ్ళను పట్టించుకోవడం లేదని అనుకుంటాడు. ఒలివర్ టెక్నాలజీ  గురించి తెలుసుకోవాలని, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి గురించి తెలుసుకుంటుంటాడు. ఆ తరువాత తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మిగిలిన స్టోరీ.

Also Read: ఆదికేశవ మూవీలోని ఈ సీన్ చూశారా..? ఆ హిట్ మూవీ నుండి కాపీ చేశారా..?


End of Article

You may also like