మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. మిన్నల్ మురళి, 2018 సినిమాలతో తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నారు.

Video Advertisement

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన టోవినో థామస్ మాయానది మూవీతో మరింత పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీ ఈ దశాబ్దంలో ‘ది హిందూ’ టాప్ 25 మలయాళ సినిమాలలో చోటు దక్కించుకుంది. మరి ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
టోవినో థామస్-ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన మాయానది 2017లో మలయాళంలో రిలీజ్ అయిన డిఫరెంట్ ప్రేమ కథ. మొదటి షోతో యావరేజ్ టాక్ తెచ్చుకొంది. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టోవినో థామస్ ఉత్తమ నటుడు, ఉత్తమ క్రిటిక్స్ అవార్డ్, స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు. ఈ చిత్రానికి ఆషిక్ అబు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మాధవ్ (టోవినో థామస్) తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయి, ఒంటరిగా జీవిస్తుంటాడు. మాధవ్ డబ్బు కోసం తప్పుడు దారిలో నడుస్తుంటాడు. అయితే ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో  కలిసిన అపర్ణ (ఐశ్వర్య లక్ష్మి)ని ప్రేమిస్తాడు. కానీ కొన్ని కారణాల వలన వారు విడిపోతారు. మాధవ్ కొన్ని రోజుల తరువాత ఒక మాఫియా డీలింగ్ సమయంలో అనుకోకుండా పోలీస్ అధికారిని చంపి, అక్కడి నుండి పారిపోతాడు.
ఇక ఆ రోజు నుండి పోలీసులు మాధవ్ కోసం వెతుకుతూ ఉంటారు. దాంతో మాధవ్ తన వద్ద ఉన్న డాలర్స్ ను ఇండియన్ కరెన్సీ లోకి మార్చి, దుబాయ్ వెళ్లి స్థిరపడాలని అనుకుంటాడు. అయితే తనతో పాటుగా తాను ప్రేమించిన అపర్ణను దుబాయ్ తీసుకుని వెళ్లాలని భావిస్తాడు. అయితే అపర్ణ అప్పటికే అతన్ని మర్చిపోయి, హీరోయిన్ గా స్థిరపడడానికి ప్రయత్నిస్తుంటుంది. తనను వెతుకుతున్న పోలీసుల నుండి తప్పించుకుని, మాధవ్ ఎలా అపర్ణను దుబాయ్ తీసుకువెళ్లాడు? ఆ తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

Also Read: “రోజా, సెల్వమణి” పెళ్లి ఫోటోలు చూశారా..? వారి పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే..?