రిలీజ్ అయిన 6 సంవత్సరాలకి OTT లోకి వచ్చింది..! ఈ సినిమా చూశారా..?

రిలీజ్ అయిన 6 సంవత్సరాలకి OTT లోకి వచ్చింది..! ఈ సినిమా చూశారా..?

by Mohana Priya

Ads

డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో సందీప్ కిషన్. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఒక సినిమా విడుదల అయిన ఆరు సంవత్సరాల తర్వాత ఆహాలోకి వచ్చింది. ఆ సినిమా పేరు ప్రాజెక్ట్ జెడ్. తమిళ్ లో మాయవన్ పేరుతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోంది. ఒక స-స్పె-న్స్ థ్రి-ల్ల-ర్ గా ఈ సినిమా రూపొందింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ సమయంలో వచ్చిన బెస్ట్ స-స్పె-న్స్ థ్రి-ల్ల-ర్ ఇది అని చాలా మంది పొగిడారు. బాక్స్ ఆఫీస్ పరంగా అంత పెద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఎంతో మంది ప్రశంసలు ఈ సినిమా అందుకుంది.

Video Advertisement

this sundeep kishan movie to have a big sequel

లావణ్య త్రిపాఠి సినిమాలో హీరోయిన్ గా నటించారు. 2017 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో సందీప్ కిషన్ ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించడం అప్పుడు కొత్త. సినిమాలో సందీప్ కిషన్ గెటప్ కూడా కొత్తగా అనిపిస్తుంది. సివి కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు నలన్ కుమారసామి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. సినిమా ఎండింగ్ కూడా ఒక స-స్పె-న్స్ తోనే ఉంటుంది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రావడం అనేది ఆసక్తికరంగా మారింది.

గత సంవత్సరం సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా సీక్వెల్ ప్రకటించారు. ఈ సినిమా ఇప్పటికే హిందీ, తమిళ్ భాషల్లో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో మాత్రం సరైన డిజిటల్ రిలీజ్ ఈ సినిమాకి ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం. దాంతో ఇప్పుడు ప్రాజెక్ట్ జెడ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇవాళ నుండి ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమాని ఇప్పుడు తప్పక చూడండి. గత కొద్ది సంవత్సరాలలో వచ్చిన బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.


End of Article

You may also like