సినిమా అంతా ఒక ఎత్తు… క్లైమాక్స్ ఒక ఎత్తు..! అసలు ఏం ఉంది ఇందులో..?

సినిమా అంతా ఒక ఎత్తు… క్లైమాక్స్ ఒక ఎత్తు..! అసలు ఏం ఉంది ఇందులో..?

by kavitha

సాయి పల్లవి గురించి తెలియని సౌత్ ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవి ప్రత్యేక  క్రేజ్ ఉంది. తెలుగు ఫ్యాన్ ఆమెను లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఫిదా మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి, సహజ నటనతో తెలుగు ఆడియెన్స్ ని మెప్పించింది.

Video Advertisement

నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపీక చేసుకుంటూ  తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది సాయి పల్లవి. ఎలాంటి పాత్రలో అయిన తనదైన నటనతో ఆకట్టుకునే ఈ బ్యూటీ నటించిన బెస్ట్ సినిమాలలో ఒకటి ‘హేయ్ పిల్లగాడ’. ఆ మూవీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దుల్క‌ర్ స‌ల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం హేయ్ పిల్లగాడ. మ‌ల‌యాళంలో రిలీజ్ అయ్యి, భారీ వ‌సూళ్ళు రాబట్టి, సంచలన విజయం సాధించిన `క‌లి` మూవీని తెలుగులో హేయ్ పిల్లగాడ గా డబ్ చేసి, రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి స‌మీర్ తాహిర్ దర్శకత్వం వహించగా,  డి.వి.కృష్ణ‌స్వామి నిర్మించారు. తమిళంలో కూడా ఈ మూవీ విజయం సాధించింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, సిద్దు (దుల్కర్ సల్మాన్) కు  చిన్న చిన్న విషయాలకు సైతం విపరీతమైన  కోపం వస్తుంటుంది. అతను  అంజలి (సాయి పల్లవి) ని లవ్ చేసి, పెళ్లి చేసుకుంటాడు. అంజలికి సిద్ధూ కోపం గురించి తెలిసినా, ఎప్పటికైనా సిద్దు కోపం తగ్గించుకుంటాడని, మారతాడని వెయిట్ చేస్తుంటుంది. అయితే సిద్దు మాత్రం అదే విధంగా ఉంటాడు. వీరిద్దరూ ఓసారి వైజాగ్ కు బయలుదేరుతారు.మార్గ మధ్యలో ఒక డాబాలో ఆగిన సమయంలో అక్కడ ఉన్న రౌడీలకు సిద్ధుకు గొడవ జరుగుతుంది. ఆ గొడవ వారి జీవితంలో ఎలాంటి మార్పులను తెచ్చింది? ఆ తరువాత వారిద్దరూ ఎలాంటి ప్రమాదంలో పడ్డారు అనేదే మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సిద్దుగా చక్కగా నటించారు. ఆ పాత్ర చుట్టూనే స్టోరీ తిరుగుతుంది. సిద్ధూ ప్రేయసిగా,  భార్యగా అంజలి పాత్రలో సాయి పల్లవి నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

Also Read: ఫ్యామిలీతో కలిసి చూడలేనని రాజశేఖర్ కూతురు వదులుకున్న ఆ మెగా హీరో సినిమా ఏంటో తెలుసా.?

 


You may also like

Leave a Comment