తెలుగు సిని పరిశ్రమలో నిజ జీవిత కథల ఆధారంగా, బయోపిక్‌లు, చారిత్రక సంఘటనల ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. యాదర్ధ ఘటనల ద్వారా రూపొందిన సినిమాలు ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాయి. అలాంటి 15 చిత్రాల జాబితాను ఇప్పుడు చూద్దాం..  movies-based-on-real-life-incidents1. జై భీమ్:
ఈ చిత్రాన్ని జస్టిస్ కె. చంద్రు నిజ జీవిత ఆధారంగా నిర్మించారు. కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించారు.
2.మేజర్:
ఈ సినిమాని 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అడివి శేష్ మేజర్ సందీప్ పాత్రలో నటించారు.3. జార్జ్ రెడ్డి:
జీవన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమా 1967-1972 మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటనలతో తెరకెక్కింది.  తెలంగాణ ప్రాంత పాలిటిక్స్ ను ప్రభావితం చేసిన స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి  బయోపిక్.
4. రక్త చరిత్ర (పార్ట్ -1,2):
నిజ-జీవిత-సంఘటనలుఈ చిత్రం రాయలసీమలో పరిటాల రవీంద్ర మరియు మద్దెల చెరువు సూరి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రెండు భాగాలుగా వచ్చింది.
5.ఖాకీ:
ఈ చిత్రం ఆపరేషన్ బవారియా కేసు గురించి జరిగిన 2005లో యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో కార్తీ, రకుల ప్రీత్ సింగ్ జంటగా నటించారు.
6. బెజవాడ:
80, 90 లలో విజయవాడ నగరంలో దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య జరిగిన జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో నాగచైతన్య, అమలా పాల్ నటించారు.
7. శివ:
రామ్ గోపాల్ వర్మ కాలేజీ స్టూడెంట్ గా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు ఆధారంగా రూపొందించబడింది. ఇందులో అక్కినేని నాగార్జున, అమల జంటగా నటించారు.
8. మౌనపోరాటం:
మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా యమున వినోద్ కుమార్ నటీనటులుగా పరిచయం అయ్యారు.
9. మలుపు:
దర్శకుడు సత్యప్రభాస్ పినిశెట్టి దశాబ్దం క్రితం జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్టుగా తెలిపారు.ఈ మూవీలో ఆదిపినిశెట్టి, నిక్కీ గ్రలాని నటించారు.
10. క్షణం:
ఈ చిత్రాన్ని అడివి శేష్ జీవితంలో యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో అడివి శేష్, ఆదా శర్మ, అనసూయ నటించారు.
11. అంతఃపురం:
ఈ చిత్రాన్ని కృష్ణవంశీ 1991లో వచ్చిన “నాట్ వితౌట్ మై డాటర్” చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు.ఇరాన్ నుండి తన కుమార్తెతో పారిపోయిన మహిళ నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందించబడింది.
12. ప్రేమలో పడితే:
ఉత్తరాదిలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు.
13. అవతారం:
కేరళలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇది అసాధారణమైన పనిని చేయగల స్త్రీ కథ.ఒరిజినల్ స్టోరిలో కొన్ని మార్పులు చేసి రూపొందించారు.
14. నా బంగారు తల్లి:
ఈ సినిమా డా. సునీత కృష్ణన్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
15. దీర్ఘ సుమంగళి భవ:
దర్శకుడు ఎస్ వీ కృష్ణారెడ్డికి వాణి అనే తన కథతో సినిమాను తెరకెక్కించమని,తన జీవితంలో జరిగిన పరిస్థితులను తెలుపుతూ చాలా లేఖలు రాసింది. వాటి ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.Also Read: “రాకీ భాయ్ మళ్లీ వస్తున్నాడు..!” అంటూ… “KGF చాప్టర్-3” అనౌన్స్మెంట్ పై 15 మీమ్స్..!

Video Advertisement