చాలా సినిమాల్లో ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వస్తుంది. ఈ సినిమా లో జంతువులకు హింసించలేదు అని. ఎందుకంటే కొన్ని సినిమాల్లో వాటిదే కీలక పాత్ర కాబట్టి. ఇంకా కొన్ని చిత్రాల్లో హీరోకి సమానమైన పాత్ర వాటికి ఉంటుంది. ఆలా వివిధ జంతువులు కీలక పాత్రలు పోషించిన చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

#1 రాజేంద్రుడు గజేంద్రుడు

1993 లో వచ్చిన రాజేంద్రుడు-గజేంద్రుడు చిత్రం లో ఒక ఏనుగు కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం లో ఆ ఏనుగు తన యజమాని చనిపోయాక రాజేంద్రప్రసాద్ తో స్నేహం చేస్తుంది. తర్వాత అతని కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.

movies in which animals play key roles..

#2 మృగరాజు
మెగాస్టార్ చిరంజీవి- సిమ్రాన్ జంట గా నటించిన ఈ చిత్రం అడవిలోని మనుషులను చంపేస్తున్న  సింహం చుట్టూనే తిరుగుతుంది.

movies in which animals play key roles..

#3 సాహసబాలుడు విచిత్ర కోతి

విజయశాంతి, బాల నటుడు నాగ అన్వేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం లో అడవిలో తప్పిపోయిన బాలుడికి చింపాంజీ తోడుగా ఉంటుంది.

movies in which animals play key roles..

#4 ఈగ
ఈ చిత్రం లో ఈగదే మెయిన్ క్యారెక్టర్. హీరో నాని చనిపోయిన తర్వాత ఈగలా మారి విలన్లను చంపుతాడు.

movies in which animals play key roles..

#5 లైఫ్ ఆఫ్ పై

లై ఆఫ్ పై అనే ఒక బుక్ ఆధారం గా తీసిన ఈ చిత్రం లో ఒక పులి, మరొక యువకుడు సముద్రం లో చిక్కుకు పోతారు. వారి అనుభవాలని ఈ చిత్రం లో చూపించారు.

movies in which animals play key roles..

#6 చార్లీ

రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన చార్లీ చిత్రం లో కుక్కదే ప్రధాన పాత్ర. ఒంటరి జీవితం గడుపుతున్న అతడి జీవితం లోకి చార్లీ వచ్చాక ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి అన్నదే ఈ చిత్రం.
movies in which animals play key roles..

#7 అదుగో
బంటి అనే పందిపిల్ల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం అదుగో.. ఆ పిందిపిల్ల కొరియర్ ద్వారా తప్పిపోతుంది. కొంత మంది గ్యాంగ్ స్టర్లు కూడా పందిపిల్ల కోసం వెతుకుతుంటారు. వాళ్ళనుండి ఆ పందిపిల్ల ఎలా తప్పించుకుంటుంది అనేది మిగిలిన కథ.

movies in which animals play key roles..

#8 ఎంటర్టైన్మెంట్
అక్షయ్ కుమార్ నటించిన ఎంటర్టైన్మెంట్ చిత్రం లో ఒక కుక్క దే కీలక పాత్ర. తన యజమాని చనిపోతూ తన ఆస్తిని అంతా తన కుక్క పేరు పై రాస్తాడు. దీని చుట్టూనే ఆ చిత్రం తిరుగుతుంది.

movies in which animals play key roles..

#9 ఆర్ ఆర్ ఆర్

ఆర్ ఆర్ ఆర్ చిత్రం లో కూడా పలు జంతువులు కీలకపాత్ర పోషించాయి. ఎన్టీఆర్ ఒక పాప ని రక్షించేందుకు పలు జంతువులను ఉపయోగించుకుంటాడు.

movies in which animals play key roles..

#10 హిట్ 2

నాని నిర్మాతగా వచ్చిన హిట్ 2 చిత్రం లో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇంకా ఈ చిత్రం లో అడివి శేష్ దగ్గర ఉండే కుక్క మాక్స్ కూడా కీలకంగా మారింది.

movies in which animals play key roles..