డైరెక్టర్ “అట్లీ” భార్య ఇన్ని సినిమాల్లో నటించారా..? ఆ సినిమాలు ఏంటంటే..?

డైరెక్టర్ “అట్లీ” భార్య ఇన్ని సినిమాల్లో నటించారా..? ఆ సినిమాలు ఏంటంటే..?

by kavitha

Ads

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలతో వరుస హిట్స్ సినిమాలను తెరకెక్కిస్తూ, తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవడంతో తన సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు చేరువయ్యారు.

Video Advertisement

ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ టాప్ హీరో షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా జరిగిన ‘జవాన్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో షారూఖ్ ఖాన్ అట్లీ భార్య ప్రియా అట్లీ గురించి మాట్లాడడంతో ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆమె పలు సినిమాలలో ఒక నటించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ దర్శకుడు అట్లీ రాజారాణి మూవీ ద్వారా దర్శకుడుగా మారాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ అవ్వడంతో, డైరెక్టర్ గా వరుసగా చిత్రాలను రూపొందించాడు. తమిళ స్టార్ హీరో విజయ్‌ దళపతితో తేరీ, మెర్సల్‌, బిగిల్‌ లాంటి చిత్రాలను తీసి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారాడు. ప్రస్తుతం అట్లీ షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ వేడుకలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ అట్లీ భార్య గురించి మాట్లాడడంతో ఆమె పేరు నెట్టింట్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. అట్లీ భార్య పేరు ప్రియా అట్లీ. ఆమె అసలు పేరు కృష్ణ ప్రియా మోహన్. ఆమె కెరీర్ బుల్లితెర పై మొదలైంది. పలు సీరియల్స్ నటించి, ఆకట్టుకుంది. అలా ఆమెకు సింగం సినిమాలో అవకాశం వచ్చింది. ప్రియ నటించిన తొలి చిత్రం సింగం. తెలుగులో యముడుగా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో అనుష్క సోదరిగా ఆమె నటించి, మెప్పించింది. ఆ తరువాత రాజారాణి, నా పేరు శివ, తేరితో పాటు ఆమె పలు తమిళ, మలయాళ సినిమాలలో నటించింది. కృష్ణ ప్రియ ఎనిమిదేళ్ల పాటు దర్శకుడు అట్లీతో డేటింగ్ చేసిన తర్వాత 2014లో నవంబర్ 9న వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తరువాత “A ఫర్ యాపిల్ ప్రొడక్షన్” పేరుతో తన స్వంత ప్రొడక్షన్‌ సంస్థను ప్రారంభించింది. ఆమె తన బ్యానర్ లో 2020లో మొదటి మూవీ అంధఘరం నిర్మించింది.

https://www.instagram.com/p/CaMzIGbhCgR/

Also Read: KUSHI REVIEW : “విజయ్ దేవరకొండ, సమంత” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 

 


End of Article

You may also like