విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా రూపొందించిన సినిమా ఖుషి. వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో జంటగా కొంచెం సేపు కనిపిస్తారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • చిత్రం : ఖుషి
 • నటీనటులు : విజయ్ దేవరకొండ, సమంత, జయరామ్, లక్ష్మి, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ.
 • నిర్మాత : నవీన్ యెర్నేని, రవి శంకర్ వై
 • దర్శకత్వం : శివ నిర్వాణ
 • సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్
 • విడుదల తేదీ : సెప్టెంబర్ 1, 2023

kushi movie review

స్టోరీ :

జాబ్ కారణంగా విప్లవ్ (విజయ్ దేవరకొండ) కాశ్మీర్ కి వెళ్తాడు. అక్కడ ఆరా బేగం (సమంత) ని కలుస్తాడు. తర్వాత తను ఆరా బేగం కాదు అని, తన పేరు ఆరాధ్య అని తెలుసుకుంటాడు. వారిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ వారి తండ్రులకి ఒకరికి ఒకరు అంటే పడదు అని వారికి తర్వాత తెలుస్తుంది. ఆరాధ్య తండ్రి ఆరాధ్య పెళ్ళికి ఒప్పుకోరు.

kushi movie review

దాంతో ఆరాధ్య బయటికి వచ్చేసి విప్లవ్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వారి కుటుంబాల్లో వచ్చిన సమస్యలు ఏంటి? వీరిద్దరికీ మధ్య వచ్చిన సమస్యలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా ట్రైలర్ చూస్తూ ఉన్నంతసేపు ఇది ఒక లవ్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. దీంతో పాటు ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఉంటాయి అని కూడా తెలుస్తోంది. సినిమా కథకి ఎంచుకున్న పాయింట్ సింపుల్ గా ఉన్నా కూడా టేకింగ్ లో కొత్తదనం ఉంది. ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే ఉంటుంది అని, కానీ తర్వాత అది పెళ్లి వరకు వెళ్తే రెండు కుటుంబాలు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? అసలు పెళ్లి అయ్యాక ఒక జంట ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది? ఇలాంటి విషయాలన్నిటినీ ఈ సినిమాలో చూపించారు.

kushi movie review

అంతే కాకుండా కొన్ని సున్నితమైన అంశాలని కూడా ఇందులో చూపించారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ చాలా బాగా నటించారు. అసలు ఇలాంటి ఒక పాత్రలో విజయ్ దేవరకొండని చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. లుక్స్ పరంగా కూడా విజయ్ దేవరకొండ చాలా బాగున్నారు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా బాగున్నాయి.

kushi movie review

సమంత కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై చూడడానికి చాలా బాగుంది. సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. వారందరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో అలా వెళ్ళిపోతుంది. అసలైన విషయం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సినిమాలో తర్వాత ఏమవుతుంది అనేది తెలిసిపోతుంది. అలాగే చాలా చోట్ల నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది.

kushi movie review

సినిమాకి అతి పెద్ద హైలైట్ హేషామ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం. ఆల్రెడీ హృదయం సినిమాలో పాటలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉంది. సినిమా షూట్ చేయడానికి వాడిన లొకేషన్స్ కూడా చాలా బాగా చూపించారు. కానీ సినిమా నిడివి విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

 • సమంత, విజయ్ దేవరకొండ నటన
 • పాటలు
 • నిర్మాణ విలువలు
 • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

 • తెలిసిపోయే కథ
 • సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

విజయ్ దేవరకొండకి హిట్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాతో ఆ లోటు తీరింది అని చెప్పవచ్చు. ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న కథలు ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒకటిగా ఖుషి సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “ఘరానా మొగుడు” సినిమా ఎన్నోసార్లు చూసే ఉంటారు…కానీ ఈ సీన్ లో ఇది ఎప్పుడైనా గమనించారా.?