సినీ పరిశ్రమలో ఇప్పటివరకు అనేక చారిత్రాత్మక చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా విడుదలైన పొన్నియన్ సెల్వన్-2 చిత్రం కూడా చారిత్రక నేపథ్యంలో వచ్చిన చిత్రమే. ఇందులో చోళ సామ్రాజ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింది.

Video Advertisement

13 వ శతాబ్దం వరకు దక్షిణ భారత దేశాన్ని చోళ సామ్రాజ్యం (తమిళ సామ్రాజ్యం) పరిపాలించింది. రాజరాజ చోళుడు చోళ రాజులలో ప్రముఖుడు. చోళ సామ్రాజ్యం పై కోలీవుడ్ లో ఇప్పటివరకు 7 సినిమాలు తెరకెక్కాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. అంబికాపతి:
ఈ చిత్రాన్ని అమెరికన్ దర్శకుడు ఎల్లిస్ ఆర్. డంగన్ తెరకెక్కించారు.  ఈ సినిమా 1937 లో విడుదల అయ్యింది.  ఇందులో ఎంకె త్యాగరాజ భాగవతార్, ఎమ్ ఆర్ సంతానలక్ష్మి , సెరుగులత్తూరు సామ వంటివారు నటించారు. అంబికాపతి స్వాతంత్ర్యం రాకముందు వచ్చిన కోలీవుడ్ సినిమాల్లో వచ్చిన హిట్‌ సినిమాలలో ఒకటి.
2. పూంపుహార్:
ఈ చిత్రం 1964లో చోళ సామ్రాజ్యం పై వచ్చిన చిత్రం. ఈ మూవీకి పి. నీలకంఠన్ దర్శకత్వం చేశారు. ఎం. కరుణానిధి రచించారు. ఈ మూవీలో ఎస్ ఎస్ రాజేంద్రన్ , రాజశ్రీ, సిఆర్ విజయకుమారి తదితరులు నటించారు.
3. రాజరాజ చోళన్:
1973లో విడుదలైన రాజరాజ చోళన్ సినిమా తమిళ సామ్రాజ్యం పై తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాకి ఏపీ నాగరాజన్ దర్శకత్వం చేశారు. చోళ రాజులలో ప్రముఖుడు అయిన మొదటి రాజరాజ చోళడి జీవితం గురించి రామనాథన్ నాటకం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శివాజీ గణేశన్ రాజరాజ చోళడుగా నటించారు. ఈ మూవీ తొలి తమిళ సినిమాస్కోప్ సినిమా.4. మధురైయై మీట్టా సుందరపాండియన్:
1978లో విడుదలైన ఈ చిత్రం తమిళ చారిత్రక యాక్షన్ సినిమా. ఈ చిత్రానికి ఎంజి రామచంద్రన్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో ఎమ్ ఎన్ నంబియార్ , పీఎస్ వీరప్ప , పద్మప్రియ, లత ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రం నటుడిగా రామచంద్రన్‌ నటించిన ఆఖరి చిత్రం. ఇది 14 జనవరి 1978న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 5. ఆయిరతిల్ ఒరువన్- యుగానికి ఒక్కడు:
ఈ చిత్రం 2010లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తె రకెక్కించారు. ఈ సినిమాలో కార్తీ , రీమా సేన్, ఆండ్రియా జెరెమియా పార్తిబన్ నటించారు. తెలుగులో యుగానికి ఒక్కడు పేరుతో డబ్బింగ్ చేశారు. 6. పొన్నియన్ సెల్వన్-1:
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్. కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా రూపొందించారు. చోళ సామ్రాజ్యంలో జరిగిన పలు సంఘటనల నేపద్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగంలో 2022 లో విడుదల అయ్యింది. తెలుగులో పొన్నియన్ సెల్వన్ టైటిల్ తో రిలీజ్ అయ్యింది.
7. పొన్నియన్ సెల్వన్-2:
పొన్నియిన్ సెల్వ‌న్ 2  తాజాగా విడుదల అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పొన్నియన్ సెల్వన్-1 కి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీక్, త్రిష త్రిష కృష్ణన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ లాంటి వారు నటించారు.
Also Read: “ఏజెంట్” VS “పొన్నియన్ సెల్వన్ 2”..! ఈ 2 సినిమాలలో కలెక్షన్స్ దేనికి ఎక్కువ వచ్చాయి అంటే..?