హృతిక్ రోషన్ “క్రిష్” నుండి… తేజ సజ్జ “హనుమాన్” వరకు… భారతీయ “సూపర్ హీరోస్” మీద రూపొందిన 8 సినిమాలు..!

హృతిక్ రోషన్ “క్రిష్” నుండి… తేజ సజ్జ “హనుమాన్” వరకు… భారతీయ “సూపర్ హీరోస్” మీద రూపొందిన 8 సినిమాలు..!

by kavitha

Ads

సూపర్ హీరో సినిమాలను చూడడానికి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చాలా ఆసక్తిని చూపిస్తారు. అయితే భారతీయ చిత్రాలలో సూపర్ హీరో కంటెంట్ తో రూపొందిన చిత్రాలు చాలా తక్కువ.

Video Advertisement

బాలీవుడ్ లో మరియు కోలీవుడ్ లో సూపర్ హీరో చిత్రాలు వచ్చాయి. ఈ  సినిమాలు తెలుగు ఆడియెన్స్ కి డబ్బింగ్ ద్వారా చేరువయ్యాయి. రీసెంట్ గా టాలీవుడ్ లోనూ సూపర్ హీరో కాన్సెప్ట్ తో 2 చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు దక్షిణాదిలో వచ్చిన, రాబోతున్న సూపర్ హీరో చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. హనుమాన్:

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ  హీరోగా “హను-మాన్” అనే  పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రం టాలీవుడ్ తొలి సూపర్ హీరో మూవీ.
2. అధీర:

ప్రొడ్యూసర్ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా ‘అధీర’ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో కాన్సెప్ట్ తో నిర్మిస్తూ, తెరకెక్కిస్తున్నాడు.

3.క్రిష్: 

20ఏళ్ల క్రితం రాకేష్‌ రోషన్‌ ‘ కోయి మిల్‌గయా’ చిత్రంతో క్రిష్‌ ఫ్రాంచైజీ ప్రారంభించారు. ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించాడు. ఆ తరువాత క్రిష్‌ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఇటువంటి కాన్సెప్ట్‌తో హాలీవుడ్‌ లో మాత్రమే చిత్రాలు వచ్చాయి. డైరెక్టర్ రాకేష్‌ రోషన్ మొదటిసారి భారతీయ సినిమాకు సూపర్‌ హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తరువాత క్రిష్ రెండవ భాగం కూడా విడుదలై రికార్డు క్రియేట్ చేసింది.
4. విక్రమ్ – మల్లన్న:

కోలీవుడ్ లో సూపర్‌హీరో కల్చర్‌ ను తీసుకొచ్చిన హీరో విక్రమ్. డైరెక్టర్ సుసీ గణేషన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా  వచ్చిన చిత్రం ‘కంఠస్వామి’. అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి సూపర్ హీరోగా  పనిచేసే ఐపీఎస్ అధికారిగా విక్రమ్ నటించాడు. ఈ సినిమాని తెలుగులో మల్లన్నగా డబ్ చేశారు. 5. విజయ్ – వేలాయుధం:

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సూపర్ హీరోగా నటించిన సినిమా వేలాయుధం. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే పాత్రలో నటించారు. 2000లో రిలీజ్ అయిన నాగార్జున నటించిన ‘ఆజాద్’ ప్రేరణతో  వేలాయుధం రూపొందింది. ఇందులో హన్సిక, జెనీలియా  హీరోయిన్లుగా నటించారు. 6. జీవా – మాస్క్:

కోలీవుడ్ హీరో జీవా ‘ముగమూడి’ అనే సినిమాలో సూపర్ హీరో పాత్రలో చేశారు. మిస్కిన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగు మాస్క్ పేరుతో డబ్ చేసి, విడుదల చేశారు.
7. శివకార్తికేయన్ – హీరో:

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ చాలా ఏళ్ల తర్వాత ‘హీరో’ అనే చిత్రంలో సూపర్ హీరో గా నటించాడు. ఈ సినిమాకి పిఎస్ మిత్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శివకార్తికేయన్ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే పాత్రను చేశారు. తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేశారు. రెండు చోట్ల ఈ చిత్రం ఆడియెన్స్ ని అలరించింది.8. టోవినో థామస్ – మిన్నల్ మురళి:

మలయాళ హీరో టోవినో థామస్ ‘మిన్నల్ మురళి’ అనే సూపర్ హీరో సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
పిడుగుపాటుకు గురై సూపర్ పవర్స్ పొందే టైలర్ పాత్రలో థామస్ నటించారు. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజై ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏ మాయ చేసావే “సమంత” నుండి… భీమ్లా నాయక్ “సంయుక్త” వరకు… వరుస హిట్స్‌తో “గోల్డెన్ లెగ్” అని పేరు తెచ్చుకున్న 9 హీరోయిన్స్..!


End of Article

You may also like