యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒకటి , ప్రశాంత్ నీల్ ల దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు.
Video Advertisement
ఇండస్ట్రీ లో హీరోలు కథను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఫ్లాప్ లు పడతాయి. ఇక సినిమాల ఎంపిక సరిగా ఉంటేనే హీరో కెరీర్ కూడా సాఫీగా సాగుతుంది. అలాగే కథను మాత్రమే నమ్ముకుని వరుసగా హిట్లు కొడుతున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
కథ విన్నాక అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని అంచనాకి రావాలంటే తారక్ తర్వాతే ఎవరైనా. ఆ విషయంలో ఎన్టీఆర్ చాలా ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటారు.
అందుకే తన దగ్గరకు వచ్చే అనేక కథలలో కేవలం హిట్టు అవుతుంది అనుకున్న కథలను మాత్రమే ఎంచుకొని ముందుకు వెళుతున్నాడు.
అలా జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో వదులుకున్న ఫ్లాప్ సినిమాలు ఏంటో చూద్దాం..
#1 లైగర్
టెంపర్ విజయం తర్వాత ఎన్టీఆర్ తో మరో చిత్రం చేయాలనుకున్నారు పూరి. దీంతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథను ఎన్టీఆర్ కు వినిపించారట. కానీ కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసారంట.
తర్వాత పూరీజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
#2 నా పేరు సూర్య
టెంపర్ కథ రాసిన వక్కంతం వంశీ కి మంచి కథ ఉంటే రెడీ చేసుకో దిరెచ్తిఒన్ ఛాన్స్ ఇస్తా అన్నారంట ఎన్టీఆర్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కథను కూడా మొదట ఎన్టీఆర్ విన్నాడు. కానీ కథ నచ్చకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.
#3 బ్రహ్మోత్సవం
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన సినిమా బ్రహ్మోత్సవం.ఈ సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరవాత తెరకెక్కింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బంధాలు బంధుత్వాలు అంటూ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. కానీ భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యింది.
#4 శ్రీనివాస కళ్యాణం
నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కల్యాణం సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కథను కూడా మొదట ఎన్టీఆర్ కు చెప్పగా కథ బోరింగ్ గా ఉందని రిజెక్ట్ చేశాడు.
#5 లై
ఇదిలా ఉంటే నితిన్ హీరోగా నటించిన మరో సినిమా లై కూడా ముందుగా ఎన్టీఆర్ వద్దకే వెళ్లిందట. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.