“దివ్యభారతి” చనిపోయిన తరవాత నిలిచిపోయిన ఆమె సినిమాల్లో డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

“దివ్యభారతి” చనిపోయిన తరవాత నిలిచిపోయిన ఆమె సినిమాల్లో డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

by Mohana Priya

Ads

ఇండస్ట్రీకి వచ్చిన కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిన వాళ్లలో దివ్య భారతి ఒకరు. చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతో పేరు తెచ్చుకున్నారు దివ్య భారతి. స్కూల్ ఎడ్యుకేషన్ సమయంలోనే దివ్య భారతి సినిమాల్లోకి అడుగు పెట్టారు. తొమ్మిదో తరగతి అయిన తర్వాత ఒక హిందీ సినిమాలో దివ్య భారతి నటించాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల దివ్య భారతి ని వేరే హీరోయిన్ రిప్లేస్ చేశారట.

Video Advertisement

1990లో వచ్చిన బొబ్బిలి రాజా సినిమా తో సినీ కెరీర్ మొదలు పెట్టారు. బొబ్బిలి రాజా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో తర్వాత దివ్య భారతి వరుసగా ఎన్నో సినిమాల్లో నటించారు. రౌడీ అల్లుడు, నా ఇల్లే నా స్వర్గం, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు, ధర్మక్షేత్రం తో పాటు విశ్వాత్మ, దిల్ కా క్యా కసూర్ , షోలా ఔర్ షబ్నమ్ , దివానా, గీత్ , దిల్ హీ తో హై , ఇంకా కొన్ని హిందీ చిత్రాలతో పాటు తమిళ్ లో కూడా ఒక సినిమాలో నటించారు దివ్య భారతి.

షోలా ఔర్ షబ్నమ్ సినిమా చేస్తున్నప్పుడు హీరో గోవిందా ద్వారా దివ్య భారతికి సాజిద్ నదియాడ్వాలా తో పరిచయం అయింది, తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకొని 1992 లో పెళ్లి చేసుకున్నారు. 1993 లో ఒక రోజు తన ఐదవ అంతస్తు అపార్ట్మెంట్ నుండి కిందపడి చనిపోయారు దివ్య భారతి. దివ్య భారతి చనిపోయే సమయానికి కొన్ని సినిమాలు చేయాల్సి ఉందట. అందులో కొన్ని హిందీ సినిమాలు ఉన్నాయి. కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి.

 

తెలుగులో దివ్య భారతి, ప్రశాంత్ నటించిన తొలి ముద్దు అనే సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు దివ్య భారతి మరణించడంతో దివ్య భారతి కి డూప్ గా హీరోయిన్ రంభ తో మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించి ఈ సినిమా పూర్తి చేశారట. అంతే కాకుండా అల్లరి ప్రేమికుడు లో కూడా హీరోయిన్ గా దివ్య భారతి చేయాల్సి ఉందట తర్వాత ఆ పాత్రను రంభ పోషించారట.

తెలుగులో దివ్య భారతి నటించిన చివరి చిత్రం ధర్మక్షేత్రం. దివ్య భారతి మరణానంతరం తొలి ముద్దు సినిమా విడుదలైంది. తొలి ముద్దు మాత్రమే కాకుండా రంగ్ , షత్రంజ్ అనే రెండు హిందీ సినిమాలు కూడా దివ్యభారతి మరణాంతరం విడుదలయ్యాయి.

 

 


End of Article

You may also like