ప్రతి వారం కొత్త చిత్రాలు విడుదల అవుతాయనే విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ మూడవ వారం విడుదల అయ్యే సినిమాలు మరింత ప్రత్యేకం కానున్నాయి. తెలుగువారు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా గ్రాండ్ గా జరుపుకునే పండుగ దసరా రానుంది.

Video Advertisement

దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం ఈ వారం థియేటర్ లో పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఆ సినిమాలు ఏమిటో? ఏ రోజున రిలీజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం..
దసరా పండుగ కానుకగా ఆడియెన్స్ కు వినోదాలను పంచడం కోసం తెలుగులో ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మూడు పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది. రెండు తెలుగు చిత్రాలు కాగా, ఒకటి  డబ్బింగ్ సినిమా, ముగ్గురు స్టార్ హీరోలే కావడం విశేషం.
bhagavanth-kesari-title-poster-1నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ హయివ్ అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
మాస్  మహారాజ రవితేజ మొదటిసారిగా నటించిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరావు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ నార్త్ లో ప్రమోషన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక మూడవ సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన లియో. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ ఏడాది ఎదురుచూస్తున్న సినిమాలలో లియో కూడా ఒకటి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలలో నటించారు.
1. భగవంత్ కేసరి: 

ఈ సినిమా అక్టోబరు 19న థియేటర్లలో రిలీజ్ కానుంది.

2. లియో: 

ఈ తమిళ డబ్బింగ్ మూవీ అక్టోబరు 19న థియేటర్లలో విడుదల కానుంది.

3. ఘోస్ట్‌:

ఈ డబ్బింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ కానుంది.

4. టైగర్ నాగేశ్వరావు:

ఈ సినిమా అక్టోబరు 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

5. గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌:

ఈ హిందీ డబ్బింగ్ మూవీ అక్టోబరు 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Also Read: నాని “హాయ్ నాన్న” టీజర్‌లో… మైనస్ అయిన విషయం ఇదేనా..?