“ఖుషి” తో పాటు… “కశ్మీర్” లో షూట్ చేసిన 10 సినిమాలు..!

“ఖుషి” తో పాటు… “కశ్మీర్” లో షూట్ చేసిన 10 సినిమాలు..!

by kavitha

Ads

సాధారణంగా మూవీ షూటింగ్ లు చేయడం కోసం అందమైన ప్రదేశాలను దర్శకులు ఎంచుకుంటారు. ప్రస్తుతం చాలా సినిమాల షూటింగ్స్ ఎక్కువగా స్టూడియోలలో, ఫిల్మ్ సిటీ లలో ఎక్కువగా పూర్తి చేస్తున్నారు. సినిమాలోని నటీనటుల ఎంపిక ఎంత ముఖ్యమో సీన్స్ తగిన ప్రదేశాలు ఎంచుకొకపోవడం వల్ల  ఆ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది.

Video Advertisement

అందులోనూ హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్, పాటలకు సహజ అందమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. వాటిలో ఇండియాలో కాశ్మీర్ టాప్ ప్లేస్ లో ఉంది. కాశ్మీర్ ను భూతల స్వర్గంగా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో సినిమాల షూటింగ్ జరిగింది. అలా షూటింగ్ జరుపుకున్న సౌత్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. దొంగ మొగుడు:

ఈ మూవీ 1987లో రిలీజ్ అయ్యింది. చిరంజీవి హీరోగా నటించగా భానుప్రియ , మాధవి, రాధిక హీరోయిన్లుగా నటించారు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాట షూటింగ్ కాశ్మీర్ లో జరిగింది.
2. రోజా:
మణిరత్నం దర్శకత్వంలో తెరకేకిన రోజా మూవీ కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ సమస్య మీద నిర్మించారు. ఈ మూవీ ఎక్కువశాతం కాశ్మీర్ లోనే షూట్ చేశారు. ఈ మూవీలో అరవిందస్వామి, మధుబాల జంటగా నటించారు.
3. ధృవ:

ఈ మూవీలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలోని చూసా చూసా పాటను కాశ్మీర్ లో షూట్ చేశారు. 4. సరిలేరు నీకెవ్వరు:

సూపర్ స్టార్ మహేష్ బాబు సోల్జర్ గా నటించిన ఈ మూవీ షూటింగ్  కాశ్మీర్లోని అందమైన అందాలు మరియు అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 5. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా:

అల్లు అర్జున్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో అల్లు అర్జున్ సైనికుడిగా నటించారు. ఈ మూవీ షూటింగ్ లో కొంత భాగాన్ని కాశ్మీర్ లో షూట్ చేశారు. 6. తేరి:

ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, సమంత జంటగా నటించారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశంను కాశ్మీర్ లో షూట్ చేశారు.
7.సవ్యసాచి:

అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీలో మాధవన్, భూమికా చావ్లా కీలకపాత్రలలో నటించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీలోని కొంత భాగాన్ని కాశ్మీర్ లో షూట్ చేశారు. 8. వైల్డ్ డాగ్:

కింగ్ నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ సినిమాను కాశ్మీర్ లో చిత్రీకరించారు. ఈ మూవీలో దియా మీర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటించారు.
9. సీతా రామం:

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతా రామం మూవీ ఎక్కువ భాగం కాశ్మీర్ లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సోల్జర్ గా నటించాడు.
10. ఖుషి:

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించి ఖుషి మూవీలోని కొంత భాగాన్ని కాశ్మీర్ లో షూట్ చేశారు.
11. లియో:

తమిళ హీరో విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లియో. ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్ లో చేశారు.
Also Read:  “మా కొండన్న హిట్ కొట్టేశాడు..!” అంటూ… విజయ్ దేవరకొండ “ఖుషి” రిలీజ్‌పై 15 మీమ్స్..!

 


End of Article

You may also like