జూనియర్ ఎన్టీఆర్ “సింహాద్రి” తో పాటు… మే నెలలో “రీ-రిలీజ్” అవుతున్న 4 సూపర్ హిట్ సినిమాలు..!

జూనియర్ ఎన్టీఆర్ “సింహాద్రి” తో పాటు… మే నెలలో “రీ-రిలీజ్” అవుతున్న 4 సూపర్ హిట్ సినిమాలు..!

by Anudeep

Ads

హీరో పుట్టిన రోజు అని అతను నటించిన పాత బ్లాక్ బస్టర్ మూవీస్ రీ రిలీజ్ చేయడం ఈ మధ్య కొత్తగా ట్రెండ్ లో ఉంది. అలాగే కొన్ని సినిమాలు థియేటర్లలో చూస్తేనే బావుంటుంది. కానీ పాత సినిమాలు థియేటర్ల లోకి వచ్చేదెలా అని ఫీల్ అవుతారు చాలా మంది. కానీ దీనికి పరిష్కారంగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది.

Video Advertisement

తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు లేదా, ఒక సినిమా ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాలను పురస్కరించుకొని వారి బ్లాక్ బస్టర్ చిత్రాలను డిజిటలైజ్ చేసి థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేష్‌ బాబు పుట్టిన రోజుకి ‘పోకిరి’, పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజున ‘తమ్ముడు’, ‘జల్సా’ చిత్రాలు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి.

 

ఇక మే నెలలో కూడా కొన్ని సూపర్ హిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి.. ఆ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

#1 ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బయోపిక్‌గా తెరకెక్కిన ఎంఎస్ ధోని చిత్రం 2016‌లో విడుదలైంది. ఈ చిత్రంలో లేట్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.

re releasing movies in this month..!!

నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని మే 12న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రీరిలీజ్‌ చేయనున్నారు.

#2 రెడీ

రామ్ పోతినేని కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘రెడీ’ ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతోంది. మే 15న రామ్ పుట్టిన రోజు జరపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ఈ హిట్ సినిమాను విడుల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు.

re releasing movies in this month..!!

2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ చిత్రానికి మూడు నంది అవార్డులు దక్కాయి.

#3 సింహాద్రి

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘సింహాద్రి’ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా మే 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

re releasing movies in this month..!!

#4 ఆది

ఎన్టీఆర్ కెరీర్‌లో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సినిమా ఆది. ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఎన్టీఆర్‌లోని మాస్ యాంగిల్‌ను డిఫ‌రెంట్‌గా చూపించారు. 2002లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

re releasing movies in this month..!!

ఈ మూవీ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న రిలీజ్ చేయనున్నారు.


End of Article

You may also like