తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి టాలీవుడ్ కు ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. ఈ ఫెస్టివల్లో కాస్త పాజిటివ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తూ ఉంటాయి. అందుకే ప్రతిసారి కూడా పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు మేకర్స్. 2024 సంక్రాంతికి కూడా అతిపెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.

Video Advertisement

గత కొంత కాలంగా టాలీవుడ్ కి సరైన హిట్స్ లేవు. ఈ ఏడాది సంక్రాంతి తో టాలీవుడ్ కి శుభారంభం అయ్యింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

#1 ప్రాజెక్ట్ కె

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

list of movies releasing in 2024 pongal..!!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 జనవరి 12న పాన్ వరల్డ్ మూవీ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

#2 మహేష్ – త్రివిక్రమ్ మూవీ (SSMB 28 )

మహేష్ 28వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించనున్నారు త్రివిక్రమ్.

list of movies releasing in 2024 pongal..!!

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ లుక్ లో ఉన్న పోస్టర్ తో పాటు జనవరి 13, 2024 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

#3 రామ్ చరణ్ – శంకర్ మూవీ (RC 15 )

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన RC15 తో రామ్ చరణ్ కూడా సంక్రాంతి 2024 సీజన్‌కు వస్తాడనే ప్రచారం ఉంది.

list of movies releasing in 2024 pongal..!!

రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ వీడియోలో RC15 టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు.

#4 సూర్య 42

తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య ‘సూర్య 42 ‘ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సూర్య 16 వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

list of movies releasing in 2024 pongal..!!

ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

#5 ఇండియన్ 2

శంకర్ దర్శకత్వం లో రానున్న RC 15 సంక్రాంతి బరిలో లేకపోతే.. కమలహాసన్ నటించిన ఇండియన్ 2 వచ్చే అవకాశం ఉంది.

list of movies releasing in 2024 pongal..!!

#6 ఫైటర్

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే తొలిసారి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఫైటర్’. ఈ చిత్రాన్ని హృతిక్ రోషన్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్’ ‘వార్’ సినిమాల డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.

list of movies releasing in 2024 pongal..!!

ఈ మూవీ ని 2024 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కి విడుదలయ్యే చిత్రాలు జనవరి 25 వరకు రన్నింగ్ లో ఉంటే హృతిక్ చిత్రానికి కష్టమే.