“నాన్నకు ప్రేమతో” సినిమాతో పాటు… నెగిటివ్ టాక్ తో కూడా సంక్రాంతి కారణంగా హిట్ అయిన 11 సినిమాలు..!

“నాన్నకు ప్రేమతో” సినిమాతో పాటు… నెగిటివ్ టాక్ తో కూడా సంక్రాంతి కారణంగా హిట్ అయిన 11 సినిమాలు..!

by Mounika Singaluri

Ads

ఒక సినిమా హిట్ అవ్వాలంటే టెక్నికల్ ప్రమోషన్స్ కన్నా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకసారి ఒక సినిమా బాగోలేదు అని గాని, బాగుంది అనిగానిఎవరి దగ్గర నుంచి అయినా టాక్ వచ్చిందంటే దాని ప్రభావం ఆ పరిసర ప్రాంతాల్లో కచ్చితంగా ఉంటుంది. అయితే ఒక్క సీజన్లో మాత్రం ఈ పబ్లిసిటీ ఏ మాత్రం పని చేయదు.

Video Advertisement

అదే సంక్రాంతి సీజన్. ఈ సీజన్లో సినిమా ఎలా ఉన్నప్పటికీ చూసి తీరాలనే ఉత్సాహంతో ఉంటారు ప్రేక్షకులు. కేవలం సినిమాలో కంటెంట్ లేకపోయినా సీజన్ వలన మాత్రమే సినిమాలు హిట్ అయినా సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

movies which became hit due to sankranti season

#1 గుంటూరు కారం : పండగలో విడుదలైన ఈ సినిమా చూసిన వాళ్ళు రెండో రోజు ఈ సినిమా థియేటర్లలో ఉంటుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ సీజన్ పుణ్యమా అని బాక్సాఫీస్ వద్ద నెల తొక్కుకుంది. నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా అబవ్ యావరేజ్ సినిమాగా నిలబడింది.

#2 శతమానం భవతి : 2017 సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ని మూట కట్టుకుంది కానీ సీజన్ కలిసి వచ్చి బాగానే క్యాష్ చేసుకుంది.

movies which became hit due to sankranti season

#3 సరిలేరు నీకెవ్వరు : 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ తో వచ్చినప్పటికీ సీజన్ కలిసి రావటం హీరోకి దర్శకుడికి ఉన్న క్రేజ్ వలన బ్లాక్ బస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది.

#4 మాస్టర్: తమిళ్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ కలిసి రావటం అలాగే లోకేష్ కనకరాజ్ క్రేజ్ కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది.

Master movie mistaken edit

#5 ఐ: మొదటి రోజు ఈ సినిమా నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది సంక్రాంతి సీజన్ కలిసి వచ్చి బాగానే క్యాష్ చేసుకొని యావరేజ్ మూవీ గా నిలిచింది.

movies which became hit due to sankranti season

#6 నాన్నకు ప్రేమతో: ఎన్టీఆర్ 25వ సినిమాగా వచ్చిన ఈ సినిమా కూడా ముందు నెగిటివ్ టాక్ మూటకట్టుకుంది కానీ సీజన్ పుణ్యమా అని యావరేజ్ టాక్ ని తెచ్చుకోగలిగింది.

#7 నాయక్: ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ కలిసి రావటము, వి వి వినాయక్ ట్రాక్ రికార్డు కలిసి వచ్చి సక్సెస్ ని సొంతం చేసుకుంది.

list of best performances of Ram charan tej..!!

#8 బిజినెస్ మాన్ : ఈ సినిమా కూడా కేవలం మహేష్ బాబు క్రేజ్ వలన సంక్రాంతి సీజన్ వలన మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

#9 జై సింహ: మొదటిరోజు నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకొని సక్సెస్ ని సాధించింది.

#10 రెడ్: రిలీజ్ అయిన రోజు నెగటివ్ టాక్ ని సొంతం చేసుకొని సంక్రాంతి సీజన్ వల్లే ఈ సినిమా గట్టెక్కింది.

krack movie ticket in red pre release event

#11 వీర సింహారెడ్డి : ఈ సినిమా కూడా కేవలం సంక్రాంతి సీజన్ వల్లనే బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

common points between mahesh babu trivikram movie and veera simha reddy


End of Article

You may also like