సాధారణంగా హీరోలను చూస్తే వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ కార్లు, బోలెడు డబ్బు, బాగా ఎంజాయ్ చేస్తుంటారు అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే తెరపై హీరోయిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులను అలరించే హీరోలు తెర వెనక పడరాని కష్టాలు పడుతూ ఉంటారు.
Video Advertisement
తెరపై సిక్స్ ప్యాక్ బాడీ తో ప్రేక్షకులకు నచ్చే లుక్ కోసం వారు తెర వెనుక చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వారి ప్రతి లుక్ విషయంలో, బాడీ లాంగ్వేజ్ విషయంలో అలాగే వాళ్ళు మాట్లాడే భాషలో ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్ లో గంటల తరబడి కష్టపడుతుంటారు మన హీరోలు. ఇందుకోసం ఇష్టమైన ఆహారాలను కూడా వదులుకుంటారు.
అయితే కొన్ని సార్లు హీరోలు ఎంత కష్టపడినా.. సినిమా ఫలితం అనుకున్న విధం గా రాదు. ఇప్పుడు ఆ లిస్ట్ లో హీరో.. ఆ సినిమాలు ఏవో చూద్దాం..
#1 లైగర్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘లైగర్’. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి.. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ కోసం విజయ్ ఏడాదిన్నర పాటు మంచి డైట్ ఫాలో అవుతూ, జిమ్ లో గంటలకు గంటలు కష్టపడ్డారట.
#2 ఏజెంట్
ఇప్పటి వరకు ఫామిలీ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన అఖిల్.. ఏజెంట్ మూవీ తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. అయితే ఊహించని విధంగా ఈ మూవీ కి ప్లాప్ టాక్ వచ్చింది. ఈ మూవీ లో అఖిల్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం ఏకంగా 10 నెలల పాటు డైట్ పాటించాడట.అంతే కాదు ఆయిల్, సాల్ట్, కారం ఇలాంటివి లేని ఆహారాన్ని మాత్రమే తీసుకున్నాడట.
#3 శక్తి
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో శక్తి సినిమా భారీ డిజాస్టర్ అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా 45 కోట్ల తో ఈ మూవీ ని తెరకెక్కించారు. ఈ మూవీ లోని రెండు పాత్రల కోసం ఎన్టీఆర్ ఎంతో శ్రమించాడు కానీ ఈ మోవి కి అనుకున్న ఫలితం రాలేదు.
#4 నా పేరు సూర్య
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ చిత్రం లోని ప్రతి సీన్లో అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కనిపిస్తోంది. అతడి పాత్రలో యాంగ్రీనెస్, దేశ భక్తి సరిగ్గా చూపించారు. ఆర్మీ సోల్జర్‌గా కనిపించడానికి అతను పడ్డ శ్రమ, కష్టం తెరపై కనిపిస్తుంది.
#5 ఖలేజా
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఖలేజా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయినా.. మహేష్’లో ఓ కొత్త కోణాన్ని చూపింది. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉంటాయి. అయితే ఈ మూవీ కోసం మహేష్ 2 సంవత్సరాలు కేటాయించారు. అలాగే సర్కారు వారి పాట మూవీ కోసం కూడా మహేష్ చాలా కష్టపడ్డారు. కానీ ఆ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చింది.
#6 వినయ విధేయ రామ
రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ మూవీ ఎన్నో అంచనాల నడుమ వచ్చి ప్లాప్ అయ్యింది. అయితే ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిగా మేక్ఓవర్ అయ్యారు. తన బాడీ ని మూవీ కి తగ్గట్టు మార్చుకోవడానికి హార్డ్ డైట్ ఫాలో అవుతూ.. జిమ్ లో చెమటలు చిందించాడు రామ్ చరణ్.
#7 అంజి
చిరంజీవి హీరోగా, కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం అంజి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు మర్చిపోలేని చిత్రం ఇది. అంతే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ బిగ్ డిజాస్టర్స్ లో అంజి కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ మూవీ క్లైమాక్స్ కోసం ఏకంగా రెండేళ్లపాటు కష్టపడ్డారట చిరు. మొత్తంగా ఈ మూవీ ఏడేళ్లపాటు షూటింగ్ జరుపుకుంది.
#8 ఐ
చియాన్ విక్రమ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఐ. ఈ మూవీ కోసం విక్రమ్ చాలా పాత్రల్లో నటించాడు. అయితే వీటిల్లో ఒక పాత్ర కోసం విక్రమ్ ఏకంగా 20 కిలోలకు పైగా బరువు తగ్గాడు. దీనికోసం విక్రమ్ ‘ప్లియోమెట్రిక్ వర్కౌట్’ ని ఫాలో అయ్యాడు. కానీ ఐ మూవీ కి యావరేజ్ రిజల్ట్ వచ్చింది.
#9 జెండాపై కపిరాజు
నాని నటించిన జెండా పై కపిరాజు చిత్రం కోసం నాని చాలా కష్టపడ్డాడు. నాని ఈ చిత్రం లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది. అలాగే ఇటీవల వచ్చిన దసరా మూవీ కోసం కూడా నాని తనని తానూ పూర్తిగా మేక్ఓవర్ చేసుకున్నాడు. ఈ చిత్రం హిట్ అయ్యింది.
#10 విశ్వరూపం
కమల్ హాసన్ హీరో గా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం విశ్వరూపం ఈ మూవీ కోసం కమల్ చాలా కష్టపడ్డారు కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
#11 జానీ
పవన్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది జానీ మూవీ. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ఫైట్స్ కోసం లాస్ ఎంజిల్స్ లో మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఐక్విడో కోసం జపాన్ వెళ్లాడు. అలాగే ఈ సినిమాలో సాధారణ యువకుడిగా కనిపించడం కోసం పవన్ గుండు కొట్టించుకున్నాడు. ఢిఫరెంట్ హెయిర్ స్టైల్ వచ్చేలా జుట్టు పెంచుకున్నాడు.ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాట స్క్రీన్ ప్లే కూడా పవన్ కల్యాణే రాశాడు.
#12 అరణ్య
విలక్షణ పాత్రల్లో నటించే కొద్ది మంది నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఎలాంటి పాత్రల్లోనైనా రాణించగల అద్భుతమైన నటుడు రానా. అరణ్య మూవీ లో రానా నటనే మెయిన్ హైలెట్. ఈ పాత్ర కోసం రానా పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. అడవి మషినిలా ఉండే అరణ్య పాత్రలో జీవించాడు రానా. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది.