Home Filmy Adda “స్వాతిముత్యం” నుండి… RRR వరకు… “ఆస్కార్” రేంజ్ కి సరిపోయే అంత కంటెంట్ ఉన్న 10 తెలుగు సినిమాలు..!

“స్వాతిముత్యం” నుండి… RRR వరకు… “ఆస్కార్” రేంజ్ కి సరిపోయే అంత కంటెంట్ ఉన్న 10 తెలుగు సినిమాలు..!

by Anudeep

ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతి చిత్రం ‘ చెల్లో షో’ ని 2023 ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ కోసం నామినేట్ చేసింది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. బాహుబలి చిత్ర డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ ఆర్ ఆర్ ఆర్ ‘ చిత్రాన్ని ఆస్కార్ కి పంపాలంటూ మొదటి నుంచి ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి. అదే కాకుండా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కాశ్మీరీ ఫైల్స్’ చిత్రాన్ని కూడా నామినేట్ చెయ్యాలని కూడా చాలా మంది భావించారు. కానీ వీటన్నిటిని దాటుకొని ‘ చెల్లో షో’ నామినేట్ అయ్యింది.

అసలు భారత చిత్రాలు ఆస్కార్ బరిలో ఉండటం చాలా తక్కువ సార్లు చూస్తున్నాం. అయితే ఆస్కార్ కి వెళ్లే అంత కంటెంట్ ఉన్న చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

#1 స్వాతి ముత్యం

దర్శకుడు కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ఈ అద్భుత చిత్రాన్ని 1986 లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరీ లో భారత్ నుంచి పంపించారు. కానీ ఈ చిత్రం నామినేట్ కాలేదు.

telugu movies which are of oscars range..

#2 శంకరాభరణం

సంగీత ప్రాధాన్యత గల ఈ చిత్రాన్ని 1980 లో దర్శకుడు విశ్వనాధ్ తెరకెక్కించారు. ఈ చిత్రం లో సోమయాజులు, మంజు భార్గవి ప్రధాన పాత్రలు పోషించారు.

telugu movies which are of oscars range..

#3 రుద్రవీణ

కె బాలచందర్ తెరకెక్కించిన ఈ చిత్రం లో చిరంజీవి, శోభన కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కూడా బావుంటుంది.

telugu movies which are of oscars range..

#4 భారతీయుడు

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సామాజిక బాధ్యత గురించి చెప్పారు. ఇందులో కమల్ హాసన్, మనీషా కొయిరాలా, ఊరిమిలా, సుకన్య కీలక పాత్రల్లో నటించారు.

telugu movies which are of oscars range..

#5 నాయకుడు
మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం లో కమల్ హాసన్ హీరో. దీనికి పలు జాతీయ అవార్డులు వచ్చాయి.

telugu movies which are of oscars range..

#6 జీన్స్

1998 లో వచ్చిన జీన్స్ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఇందులో ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

telugu movies which are of oscars range..

#7 అంజలి

మణిరత్నం నిర్మాత, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం లో షామిలి, తరుణ్ బాల నటులుగా నటించారు.

telugu movies which are of oscars range..

#8 మహానటి

మహంతి సావిత్రి జీవితకథని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది.

telugu movies which are of oscars range..

#9 రంగస్థలం

సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం చిత్రం గ్రామీణ నేపథ్యం లో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది.

telugu movies which are of oscars range..

#10 శ్యామ్ సింగ రాయ్

పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించారు. ఈ చిత్రం లో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు.

telugu movies which are of oscars range..

#11 బాహుబలి

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తం గా తెలుగు చిత్ర ఖ్యాతిని ఎలుగెత్తి చాటింది. ఈ చిత్రం లో ప్రభాస్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.

telugu movies which are of oscars range..

#12 ఆర్ ఆర్ ఆర్

స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతా రామ రాజు, కొమరం భీం జీవితాల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

telugu movies which are of oscars range..

You may also like