‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత తన కృషి, పట్టుదలతో క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలకు దూరమవుతుంటారు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా ప్రాధాన్యమున్న చిత్రాలు ఎంచుకుంటూ మంచి చిత్రాలు చేసింది. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సామ్.. ఆ తర్వాత తనకు మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందంటూ ప్రకటించి ఫాన్స్ ని షాక్ కి గురి చేసింది.

Video Advertisement

తాజాగా యశోద చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సామ్. త్వరలో ఖుషి, శాకుంతలం చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనుంది. తాజాగా విడుదలైన శాకుంతలం ట్రైలర్ తో సామ్ అందరి మనసులు గెలుచుకుంది. అయితే సామ్ ని ఇంతటి స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం..

 

#1 ఏమాయ చేసావే

సమంత హీరోయిన్ గా అడుగు పెట్టిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. ఈ చిత్రం లో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఈ చిత్రం లో జెస్సి పాత్రలో నటించిన సామ్..తన నటనతో అందరి మనసులు దోచుకుంది.

the best movies of samantha..!!

#2 ఈగ

రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రం లో సామ్.. తాను ప్రేమించిన వ్యక్తిని చంపిన వాడిపై పగతీర్చుకొనే యువతిగా అందర్నీ మెప్పించింది.

the best movies of samantha..!!

#3 మనం

అక్కినేని ఫామిలీ చిత్రం గా తెరకెక్కిన మనం చిత్రం లో సామ్ అద్భుతంగా నటించింది.

the best movies of samantha..!!

#4 అ ఆ

తల్లిని మెప్పించలేని ఒక నిస్సహాయ కూతురి పాత్రలో సమంత ఈ చిత్రం లో చాలా బాగా నటించింది.

the best movies of samantha..!!

#5 సూపర్ డీలక్స్

తమిళం లో వచ్చిన సూపర్ డీలక్స్ చిత్రం లో విలక్షణ పాత్రలో నటించి మెప్పించింది సామ్.

movies which made samantha a great actor

#6 ఏటో వెళ్లిపోయింది మనసు

గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం లో సమంత, నాని జంటగా నటించారు. ఈ చిత్రం లో తనలోని అన్ని కోణాలను బయటపెటింది సామ్.

the best movies of samantha..!!

#7 రంగస్థలం

సుకుమార్ దర్శకత్వం లో సామ్, రామ్ చరణ్ జంటగా నటించిన రంగస్థలం చిత్రం ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనకు తెలుసు. ఈ చిత్రం లో రామలక్ష్మి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది సామ్.

the best movies of samantha..!!

#8 ఓ బేబీ

నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ చిత్రం లో రెండు భిన్నమైన పాత్రల్లో నటించి అందర్నీ మెప్పించింది సామ్.

the best movies of samantha..!!

#9 ఫ్యామిలీ మాన్

ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో తనలోని మరో కోణాన్ని బయటకి తీసింది సామ్. ఆ తర్వాత ఆమెకు పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ పెరిగింది.

the best movies of samantha..!!

#10 మజిలీ

భర్త ప్రేమకు నోచుకోని ఒక మధ్యతరగతి ఇల్లాలిగా మజిలీ చిత్రం లో సామ్ తన నటనతో అందర్నీ కట్టిపడేసింది.

the best movies of samantha..!!

#11 మహానటి

మహానటి సావిత్రి జీవితకథని తెరకెక్కిన ఈ చిత్రం లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించగా.. ఒక సహాయ పాత్రలో సామ్ నటించి అందర్నీ మెప్పించింది.

the best movies of samantha..!!

#12 సన్ ఆఫ్ సత్యమూర్తి

త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక జెస్టేషనల్ డయాబెటిక్ పేషెంట్గా నటించి మెప్పించింది సామ్.

the best movies of samantha..!!