సూర్య సినిమా రంగంలోకి వచ్చి ఇటీవలే 25 ఏళ్లు పూర్తయ్యాయి. 1997లో ‘నెరుక్కు నెర్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు నటుడు సూర్య. ఆ తర్వాత హీరోగా సుమారు 40కి సినిమాల్లో యాక్ట్ చేశారు.కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్, మరికొన్ని సినిమాలను నిర్మించి నిర్మాతగా మారారు.

Video Advertisement

కార్తీ, విక్రమ్, అజిత్, విజయ్ వంటి తోటి తమిళ నటులతో పోలిస్తే తెలుగు సినీ ప్రేక్షకులకు సూర్య అంటే అభిమానం ఎక్కువ. తెలుగులో వెంకటేష్ చేసిన ఘర్షణ సినిమా తమిళం లో సూర్య చేసిన తర్వాత రీమేక్ చేశారు. అప్పట్లో సూర్య పేరు తెలియని వారికి ఈ చిత్రం తో నోటెడ్ అయిపోయాడు సూర్య.

hero surya super hit telugu movies
హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా సూర్య సినిమాలు ఇప్పటికీ మంచి ఓపెనింగ్స్‌ని తెచ్చిపెడుతున్నాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలకంటే సూర్య మూవీస్ కి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చిన రోజులున్నాయి. కానీ ఈ క్రమం లో సూర్య మార్కెట్ కొంచెం డౌన్ అయ్యిందనేది వాస్తవం. ఇప్పుడు సూర్య ని తెలుగు లో స్టార్ గా నిలబెట్టిన సినిమాలేంటో చూద్దాం..

#1 యువ

hero surya super hit telugu movies
మాధవన్, సిద్దార్థ్ తో కలిసి సూర్య నటించిన చిత్రం యువ. దీనికి మణిరత్నం దర్శకుడు. ఈ చిత్రం తో సూర్య కి తెలుగులో ఒక గుర్తింపు వచ్చింది.

#2 గజిని

hero surya super hit telugu movies
ఒరిజినల్ విడుదలైన 3 నెలల లోపే తమిళ గజిని యొక్క డబ్బింగ్ వెర్షన్‌ను ఆంధ్రాలో విడుదల చేయడం ద్వారా అల్లు అరవింద్ మంచి లాభాలను పొందారు. సూర్య కి తెలుగులో ఇంతటి పేరు రావడానికి కారణం ఖచ్చితంగా ఈ సినిమానే.
ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది.

#3 యముడు సిరీస్

hero surya super hit telugu movies
డైరెక్టర్ హరి తీసిన యముడు..సూర్య పవర్ ప్యాకెడ్ పెర్ఫార్మన్స్ తో ఈ చిత్రాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.

#4 సూర్య సన్ ఆఫ్ కృష్ణన్

hero surya super hit telugu movies
గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సూర్య.

#5 వీడొక్కడే

hero surya super hit telugu movies
ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కి ఇప్పటికి అందర్నీ అలరిస్తుంది. . తమన్నా తో సూర్య కలిసి నటించిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది.

#6 ఆకాశం నీ హద్దు రా

hero surya super hit telugu movies
తెలుగు మహిళ సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ లో విడుదల అయ్యింది. గోపినాథ్ అనే వ్యక్తి జీవిత అంశాలను తీసుకొని చేసిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.