ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం.. ఒక్క శుక్రవారంతో మొత్తం జీవితాలే మారిపోతాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం మళ్లీ మొదటి నుంచి కెరీర్ ప్రారంభించాల్సి ఉంటుంది లేదా ఇండస్ట్రీ నుంచే తప్పుకోవాల్సి ఉంటుంది.

Video Advertisement

అందుకే సినిమా తీసేప్పుడు జాగ్రత్తగా ఉంటారు దర్శకులు. అదే స్టార్ హీరోలతో చేసేప్పుడైతే ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సినిమా హిట్ అయితే అతని కెరీర్ లో వెనిక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం చేతిలో ప్రాజెక్ట్స్ లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తుంది.

అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు చేసిన తర్వాత డైరెక్టర్ కిషోర్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్, రాధే శ్యామ్ తర్వాత రాధాకృష్ణ చేతిలో ప్రాజెక్ట్‌లు లేకుండా ఇంటికే పరిమితం అయ్యారు. సాహో విడుదల అయిన ఇన్ని సంవత్సరాలకి సుజిత్ పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటించారు. చిన్న హీరోలతో సినిమాలు చేయడం ఇష్టం లేక, పెద్ద స్టార్లు వారితో చేయడానికి ముందుకు రాకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు ‘స్టార్ హీరో ఫిల్మ్’ బాధితుల జాబితాలోకి కొత్తగా మరో దర్శకుడు చేరాడు.

 

అతను మరెవరో కాదు పరశురామ్. మహేష్ బాబుతో సర్కారు వారి పాట దర్శకత్వం వహించిన తరువాత, పరశురామ్ స్టార్ డైరెక్టర్ల లీగ్‌లో చేరతాడని అంత అనుకున్నారు. కానీ ఈ సినిమా అభిమానుల అంచనాలను, బాక్సాఫీస్‌ను అందుకోలేకపోయింది. దీంతో పరశురామ్ సూపర్‌స్టార్‌ను హ్యాండిల్ చేయలేడని చాలా మంది ఫిర్యాదు చేశారు. పైగా అతను మహేష్‌ను భయపెట్టే కొన్ని సన్నివేశాలు చేశాడు.

 

కొన్ని ఎదురుదెబ్బల కారణంగా ఏ పెద్ద స్టార్ అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు. విజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం ద్వారా అతను సంపాదించుకున్న ఆదరాభిమానాలన్నీ ఇప్పుడు తగ్గిపోయాయి. పరశురామ్‌కి ఇప్పుడు చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఏం లేవు. అతను మొదటి నుండి మళ్లీ ప్రారంభించాలి. స్టార్ సినిమాలు వరం కంటే శాపంగా ఎలా మారతాయో నిరూపించడానికి పరశురామ్ మరో ఉదాహరణగా చెప్పవచ్చు.