టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ 30’ (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. గతం లో వీరిద్దరి కాంబోలో ‘జనతా గ్యారేజ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చిత్రం వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ను జరపుకోనుంది.

Video Advertisement

 

అయితే, కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్‌తో సినిమాపై అభిమానుల్లో కాస్త ఆందోళన ఏర్పడింది. దీంతో ఈ సినిమాపై మరింత పగడ్బందీగా కొరటాల శివ పనిచేస్తున్నారు. అయితే ఈ చిత్రం లో హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ 30లో నటించనున్నారని ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎన్టీఆర్‌ 30లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.

mrunal thakur is the neroine for NTR 30..??

సీతారామం సినిమా చూసిన వారు మృణాల్ ఠాకూర్ ను అంత సులభంగా మర్చిపోరు. అందం, అభినయం కలబోసిన ఈ బాలీవుడ్ భామ.. సీతారామం సినిమాలో బాపుబొమ్మలా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. మృణాల్ అందానికి తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికే మృణాల్ ను కూడా సంప్రదించారట. ఆమె కూడా వెంటనే ఓకే అందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా రాబోతుందని అంటున్నారు. ఇక, మృణాల్‌ను ఎంపిక చేశారన్న వార్తలతో తారక్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

mrunal thakur is the neroine for NTR 30..??

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో ఎన్టీఆర్‌ 30 సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ 30కి ర‌త్న‌వేల్‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. మ‌రోవైపు ‘కేజీఎఫ్’ డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మరో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.